Pak Army vs People (Image Source: Twitter)
అంతర్జాతీయం

Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!

Pak Army vs People: సొంత పౌరులపైనే పాక్ సైన్యం బాంబుల వర్షం కురిపించడం.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. సోమవారం ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa Province) పై పాక్ సైన్యం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మహిళలు, పిల్లలు సహా ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఆర్మీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారహు. ‘తమ పిల్లలు ఉగ్రవాదులా?’ అంటూ మండిపడుతున్నారు. ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎదురుతిరిగిన ప్రజలు, నేతలు
ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని తిరాహ్ లోయ (Tirah valley) ప్రాంతంలో ఈ పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. దీంతో బాధితులు పాక్ సైన్యం, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమ ఇళ్లపై బాంబుల వర్షం కురిపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలు ఏమైనా ఉగ్రవాదులా? అని పాక్ సైన్యాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రతిపక్ష ఎంపీ ఇక్బాల్ ఆఫ్రిది మాట్లాడుతూ ‘పాకిస్థాన్ ఆర్మీ జారవిడిచిన బాంబుల వల్లే ఈ పేలుళ్లు జరిగాయని అన్నారు. మరోవైపు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఎమ్మెల్యే సోహైల్ ఖాన్ ఆఫ్రిది కూడా ఇదే వాదనను బలపరిచారు. ‘పాక్ భద్రతా బలగాలు.. ఎలాంటి ఆయుధాలు లేని అమాయక పౌరులను బలితీసుకున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరు నేతలు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినవారు కావడం గమనార్హం.

అసెంబ్లీ స్పీకర్ వార్నింగ్
మరోవైపు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్పీకర్ బాబర్ సలీం స్వాతి కూడా దాడిపై ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు. ‘జెట్ విమానాల దాడుల వల్ల పౌరులు చనిపోయారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని అన్నారు. ‘మన సొంత ప్రజల ప్రాణాలను ఇంత తెలిగ్గా తీసుకొని వారిపైనే బాంబులు వేస్తే అది అందరిలో ఆగ్రహ జ్వాలకు కారణమవుతుంది’ అని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

మానవ హక్కుల కమిషన్ ఆవేదన
మరోవైపు పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ సైతం ఖైబర్ పఖ్తున్ ఖ్వాపై జరిగిన దాడి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు, పౌరులు చనిపోవడం దుర్మార్గమని పేర్కొంది. ‘ఈ ఘటనపై తక్షణం, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలి. పౌరుల ప్రాణాలను కాపాడటం రాజ్యాంగబద్ధ కర్తవ్యం. కానీ అది పదేపదే విఫలమవుతోంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.

దాడిపై భిన్నవాదనలు
అయితే ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ కు చెందిన స్థానిక పోలీసు అధికారి వాదన ఇందుకు భిన్నంగా ఉంది. తిరాహ్ లోయలోని పాకిస్థాన్ తాలిబాన్‌ (టిటిపి) నియంత్రణలో ఉన్న ఒక స్థావరంలో పేలుడు జరిగిందని ఆయన పేర్కొన్నారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంతో అవన్నీ పేలిపోయి మిలిటెంట్లతో పాటు స్థానిక పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. దీనికి ఆర్మీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కానీ ప్రతిపక్ష నేతలు, మరికొందరు అధికారులు వాదన మాత్రం మరోలా ఉంది. రాత్రివేళ పాకిస్థాన్ ఆర్మీ విమానాల నుండి జరిపిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ లో భాగంగానే ఈ బాంబులు పడినట్టు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పాక్ ప్రభుత్వం లేదా సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

Also Read: Viral Video: నషా ఎక్కిన యువ జంట.. పోలీసు జీపుపైనే రొమాన్స్.. ఎంతకు తెగించార్రా!

మరణాల సంఖ్య
స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కనీసం 10 మంది పౌరులు (అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు) మృతి చెందారు. అలాగే 14 మంది టిటిపి మిలిటెంట్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు టిటిపి కమాండర్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖైబర్, బజౌర్ వాయువ్యంలోని మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ టిటిపి పై ఆపరేషన్లు కొనసాగిస్తోంది. టిటిపి విషయానికి వస్తే ఆ సంస్థ.. 2007 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటు చేస్తోంది. ఇది ఆఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబాన్లను పోలిన ఉగ్రవాద సంస్థ. ఈ రెండు సంస్థలు సిద్దాంతపరంగా సారుప్యతను కలిగి ఉన్నాయి.

Also Read: Afghan Boy: విమానానికి వేలాడుతూ.. భారత్‌కు వచ్చిన అఫ్గాన్ బాలుడు.. వీడు మామూలోడు కాదు!

Just In

01

Katrina Kaif: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్‌ ఫొటోలు

No Diwali Gifts: ప్రజాధనంతో ఉద్యోగులకు గిఫ్టులా? కేంద్రం కన్నెర్ర.. కీలక ఆదేశాలు

Medak District: మెదక్ జిల్లాలో ఘోర సంఘటన.. ఏడాదిన్నర దూడపై యువకుడి అఘాయిత్యం

H1B Exemption: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!

CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పణ