Car-Bike price cuts: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమలులోకి వచ్చాయి. సవరించిన జీఎస్టీ రేట్లు అన్ని రంగాలతో పాటు ఆటోమొబైల్ రంగంలో కూడా వర్తిస్తున్నాయి. సవరించిన జీఎస్టీ రేటు ప్రయోజనాలను వాహన తయారీ సంస్థలు నేరుగా వినియోగదారులకు అందజేస్తున్నాయి. దీంతో, వినియోగదారులు తగ్గింపు రేటుతో వాహనాలకు కొనుగోలు చేసేందుకు అవకాశం దక్కింది. ప్రధానంగా, ఎంట్రీ లెవల్ హాచ్‌బ్యాక్ కార్లపై రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తోంది. లగ్జరీ ప్రీమియం ఎస్‌యూవీలపై ఏకంగా రూ. 30 లక్షల వరకు ధర తగ్గింపు దక్కే అవకాశం ఉంది. దీంతో, భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ధర తగ్గింపులలో ఒకటిగా నిలవనుంది. మారుతీ సుజుకీ వంటి బడ్జెట్ కార్ల నుంచి, రేంజ్ రోవర్ వంటి అత్యంత ఖరీదైన ఎస్‌యూవీల వరకు, హోండా ఆక్టివా, షైన్ వంటి టూవీలర్ వాహనాలపై కూడా కస్టమర్లు గణనీయమైన తగ్గింపును పొందే అవకాశం ఉంది.
బ్రాండ్‌ల వారీగా తగ్గింపు వివరాలివే
తగ్గనున్న మహింద్రా వాహనాల లిస్ట్ ఇదే
బొలేరో నియో – రూ.1.27 లక్షలు తగ్గింపు
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పెట్రోల్ వేరియంట్ – రూ.1.40 లక్షలు తగ్గింపు
డీజిల్ వేరియంట్ – రూ. 1.56 లక్షలు తగ్గింపు
థార్(రేంజ్) – గరిష్టంగా రూ. 1.35 లక్షలు తగ్గింపు
థార్ రాక్స్ – రూ. 1.33 లక్షలు తగ్గింపు
స్కార్పియో క్లాసిక్ – రూ.1.01 లక్షలు తగ్గింపు
స్కార్పియో ఎన్ – రూ. 1.45 లక్షలు తగ్గింపు
ఎక్స్‌యూవీ700 – రూ. 1.43 లక్షలు తగ్గింపు
టాటా మోటార్స్ వాహనాలు -రూ. 1.55 లక్షల వరకు తగ్గింపు
టియాగో – రూ.75,000 తగ్గింపు
టైగోర్ – రూ.80,000 తగ్గింపు
అల్ట్రోజ్ – రూ. 1.10 లక్షలు తగ్గింపు
పంచ్ – రూ. 85,000 తగ్గింపు
నెగ్జాన్ – రూ. 1.55 లక్షలు తగ్గింపు
హ్యారియర్ – రూ.1.40 లక్షలు తగ్గింపు
సఫారీ – రూ.1.45 లక్షలు తగ్గింపు
కర్వ్ – రూ. 65,000 తగ్గింపు
టొయోటా కార్లపై గరిష్ఠంగా రూ.3.49 లక్షల వరకు తగ్గింపు
ఫార్చునర్ – రూ.3.49 లక్షలు తగ్గింపు
లెజెండర్ – రూ. 3.34 లక్షలు తగ్గింపు
హిలుక్స్- రూ.2.52 లక్షలు తగ్గింపు
వెల్‌ఫయర్- రూ.2.78 లక్షలు తగ్గింపు
కామ్రీ – రూ.1.01 లక్షలు తగ్గింపు
ఇన్నోవా క్రిస్టా – రూ.1.80 లక్షలు తగ్గింపు
ఇన్నోవా హిక్రాస్ – రూ. 1.15 లక్షలు తగ్గింపు
ఇతర మోడల్స్ – గరిష్ఠంగా రూ.1.11 లక్షల వరకు తగ్గింపు
Read Also- Bathukamma Festival: శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. స్త్రీల సాంప్రదాయానికి ప్రతీక
రేంజ్ ఓవర్ కార్లు గరిష్ఠంగా రూ.30.4 లక్షల వరకు తగ్గింపు
రేంజో రోవర్ 4.4పీ ఎస్‌వీ ఎల్‌డబ్ల్యూబీ – రూ.30.4 లక్షలు తగ్గింపు
రేంజ్ రోవర్ 3.0డీ ఎస్‌వీ ఎల్‌డబ్ల్యూబీ – రూ. 27.4 లక్షలు తగ్గింపు
రేంజ్ రోవర్ 3.0పీ ఆటోబయోగ్రఫీ – రూ. 18.3 లక్షలు తగ్గింపు
రేంజ్ రోవర్ స్పోర్ట్ 4.4 ఎస్‌వీ ఎడిషన్ టూ – రూ.19.7 లక్షలు తగ్గింపు
రేంజ్ రోవర్ వెలార్ 2.0డీ / 2.0పీ ఆటోబయోగ్రఫీ – రూ.6 లక్షలు తగ్గింపు
రేంజ్ రోవర్ ఈవోక్యూ 2.0డీ/ 2.0పీ ఆటోబయోగ్రఫీ – రూ. 4.6 లక్షలు తగ్గింపు
డిఫెంర్ రేంజ్ – గరిష్టంగా రూ.18.6 లక్షల వరకు తగ్గింపు
డిస్కవరీ – గరిష్టంగా రూ. 9.9 లక్షలు తగ్గింపు
డిస్కవరీ స్పోర్ట్ – రూ. 4.6 లక్షలు తగ్గింపు
రేట్లు తగ్గిన బైకులు ఇవే
జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి రావడంతో పలు బైకుల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దేశంలో అందుబాటులో ఉన్న బైకుల్లో 98 శాతానికి పైగా 350సీసీ లోపు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లే ఉన్నాయి. వీటిపై జీఎస్టీ రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడంతో, వినియోగదారులకు భారీ ఊరట దక్కింది. ముఖ్యంగా, ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. హీరో స్ప్లెండర్, హోండా ఆక్టివా, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లాంటి పాపులర్ మోడల్స్ తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి.