Kishan Reddy ( image crdit: swetcha reporter)
హైదరాబాద్

Kishan Reddy: డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడటమే లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: రాష్ట్రంలో రోజురోజుకూ విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలువుతున్నారని, స్కూల్స్ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీల వరకు డ్రగ్స్ కు పిల్లలు, యువత అడిక్ట్ అవుతున్న పరిస్థితుల్ని చూస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే అందరం సమైక్యంగా డ్రగ్స్ ను అరికట్టేందుకు పోరాటం చేయాలని, అవగాహన సైతం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ 75వ జన్మదినం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ వద్ద 3కే రన్ ను నిర్వహించారు.

 Also Read: Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

నషా ముక్త్ భారత్ లక్ష్యం

ఈసందర్భంగా ఈ రన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నషా ముక్త్ భారత్ లక్ష్యంగా డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడడమే లక్ష్యంగా యువతను చైతన్యం చేసేందుకు 3కే రన్ నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అని, యువ మేధాస్సు కలిగిన దేశం మనదని, యువతను, దేశ భవిష్యత్ ను రక్షించుకోవాలన్నారు. అప్పుడే దేశం మరింత అభివృద్ధి సాధించగలుగుతుందని వ్యాఖ్యానించారు.

2047వరకు ప్రపంచంలో భారత్ నంబర్ వన్ దేశం

భారత ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ కంట్రీ కోసం అనేక చర్యలు చేపడుతోందని, అంఉలో భాగంగానే డ్రగ్స్ పై యువతను పిల్లల్ని తల్లిదండ్రులని చైతన్యం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికడితే దేశానికి తిరుగుండదని ధీమా వ్యక్తంచేశారు. 2047వరకు ప్రపంచంలో భారత్ నంబర్ వన్ దేశంగా అవతరించాలంటే డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు కూడా దీని బాధ్యత తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అన్ని విభాగాల్లో ఏబీవీపీ విజయాన్ని సాధించడంపై కిషన్ రెడ్డి గెలిచిన సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.

 Also Read: OG concert rain disruption: వరుణుడి ఎఫెక్ట్ తో నిరాశపరిచిన ‘ఓజీ’ కాన్సర్ట్.. మరీ ఇన్ని అడ్డంకులా..

Just In

01

Vote-for-Note Case: ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..

Adultery: వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. అనుమతులు లేకుండా నడుస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్

Sai Durgha Tej: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. సాయి దుర్గ తేజ్‌ ‘ఓజీ’ ట్రైల‌ర్‌ రివ్యూ