Crime News: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!
Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా సుజాతా నగర్‌లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తనకు ఐఫోన్ కొనివ్వలేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు, అక్కడి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెలితే.. విశాణ పట్నం జిల్లా సుజాత నగర్‌కు చెందిన సాయి మారుతి కెవిన్(Sai Maruti Kevin) (26) అనే యువకుడు కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌(Hyderabad) లోని సినీ పరిశ్రమలో పని చేశాడు. అయితే అక్కడ యువకుడికి అవకాశాలు తగ్గడంతో ఇటీవలే హైదరాబాద్ నుండి తన స్వంత గ్రామానికి తిరిగి వచ్చాడు.

తండ్రి ఆర్థిక పరిస్థితులు..

ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని నిర్నయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఈ మధ్యకాలంలో తనకు ఖరీదైన ఐఫోన్(I Phone) కావాలని తన తండ్రిని పదేపదే అడుగుతున్నాడు. కొన్నిరోజులుగా ఐఫోన్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య కొన్ని సార్లు వాగ్వాదం జరిగేదని అక్కడి స్థానికులు కూడా చెబుతున్నారు. తండ్రి ఆర్థిక పరిస్థితులు బాగా ఉండేవి కావు. అందుకు కుటుంబ అవసరాలు తీర్చేవరకే అతడి సంపాదన సరిపోయేది. ఈ క్రమంలో తను కమారుడికి ఐఫోన్ కొనియ్యలేక పోయాడు అతని తండ్రి. ఎన్నిసార్లు అడిగిన సాయి తండ్రి సెల్ ఫోన్ కొనియ్యక పోవడంతో సాయి మారుతి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దాన్ని మనసులో పెట్టుకున్న సాయి ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మరోసారి గోడవ పెట్టుకున్నాడు. అనంతరం తన గదిలోకి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత తను బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యలు తలుపు తట్టారు.

Also Read: KTR: యువత ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరించొద్దు: కేటీఆర్

గదిలోకి వెల్లి చూడగా..

ఎంత పిలిచిన తను స్పందించక పోవడంతో తలుపులు విరగోట్టి లోపలికి వెల్లారు. గదిలోకి వెల్లి చూడగా సాయి మారుతి ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించాడు. షాక్క కిగురైన అతని కుటుంబ సబ్యలు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే అతడు చనిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటనతో అక్కడి పరిసర ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై వాపోయారు. తన కొడుకు అడిగిన చిన్న కోరికను నెరవేరలేదన్న కారణంతో తను ప్రాణాలు తీసుకోవడం తట్టుకోలేకపోతున్నాం అంటూ తల్లిదండ్రులు గోడును విలపిస్తున్నారు. అక్కడి స్ధానికులు సైతం కేవలం ఐఫోన్ కోసం ప్రాణం తీసుకోవడం ఎంత దారుణమని అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గటనతో అక్కడి ప్రాంత మంతా విషాద చాయలు అలుముకున్నాయి.

Also Read: Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

Just In

01

City Police Annual Press Meet: హైదరాబాద్‌లో 405 అత్యాచారాలు.. 69 దారుణ హత్యలు.. క్రైమ్ చిట్టా విప్పిన సజ్జనార్

Telangana Education: కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా సర్కారు బడి.. నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు!

Viral Video: మెట్రోలో మహిళపై లైంగిక వేధింపులు.. వీడియో వైరల్

Highest Grossing Movies: 2025లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాలు ఇవే..

Jagga Reddy on Pawan Kalyan: సినిమాలోనే కాదు.. బయటా యాక్టింగే.. పవన్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్