Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రేటింగ్స్ పరంగా గట్టిగానే దూసుకెళ్తుంది. గత సీజన్లతో పోలిస్తే కొంచెం ఊపు తగ్గినట్టుగా అనిపించినా, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం టాప్ గేర్‌లో ఉందనడంలో సందేహమే లేదు. ఈ సీజన్‌లో కామనర్స్ vs సెలెబ్రిటీల ఫార్మాట్ కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
కంటెస్టెంట్స్ తమ గొడవలు, డ్రామాలు, బుజ్జగింపులతో ఆడియెన్స్ ను ఫుల్ ఎంగేజ్ చేస్తున్నారు. ఎక్కడైనా జోష్ తగ్గినట్లు అనిపిస్తే, బిగ్ బాస్ స్వయంగా రంగంలోకి దిగి కొత్త రచ్చ రేపడానికి రెడీగా ఉంటాడు. రెండో వారం ముగిసే సమయంలో మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా, ఈ వారం మర్యాద మనీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మనీష్ గత వారం ప్రవర్తన చాలా మందికి చిరాకు తెప్పించిందనడంలో అనుమానమే లేదు. అయితే, డేంజర్ జోన్‌లో ప్రియాంక కూడా ఉంది, ఆమెకు వోటింగ్ కూడా చాలా తక్కువగా వచ్చింది. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.
ఇక రెండు వారాలు గడిచిన తర్వాత బిగ్ బాస్ ఆడియన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. సీజన్ 9లో మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం స్టేజ్ సెట్ అవుతోంది. ఈ సీజన్‌కు మరింత గ్లామర్ జోడించేందుకు కాంట్రవర్సీ క్వీన్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష రాబోతోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు, ఆమె గ్లామర్, రీల్స్ డాన్స్‌లతో రచ్చ రేపుతుంది. ఇటీవల తన బిజినెస్‌తో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ అదే ఫేమ్‌తో బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టబోతోంది. రాబోయే రెండు వారాల్లో డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్, నాలుగో లేదా ఐదో వారంలో రమ్య మోక్ష ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె వచ్చాక హౌస్ లోకి వెళ్ళాక ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.
Also Read: Chamala Kiran Kumar Reddy: మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి