Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓజీ’ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అన్నీ ఈ సిినిమా పోస్ట్‌లే. ఈ సినిమా నుంచి విడుదలైన ‘వాషి యో వాషి’ ట్రాక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వాయిస్‌తో సాగే ఈ ట్రాక్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా ఈ ట్రాక్ గురించి సంగీత దర్శకుడు ఎస్. థమన్, తను జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇది సినీ వర్గాల్లో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే..
ఆ రూల్‌ని బ్రేక్ చేశారు
ఈ కార్యక్రమంలో థమన్ మాట్లాడుతూ.. ‘ఖుషి’ సినిమా తర్వాత అంటే సుమారు రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ రికార్డింగ్ స్టూడియోకు వచ్చారని తెలిపారు. 20 సంవత్సరాలుగా ఆయన రికార్డింగ్ థియేటర్‌కు రాలేదని, కానీ ‘ఓజీ’ కోసం ఆయన తన రూల్‌ని బ్రేక్ చేశారని వెల్లడించారు. అంతేకాకుండా, పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ఫస్టాఫ్ వరకు చూశారని, ఇది ఆయనకు చాలా బాగా నచ్చిందని థమన్ తెలిపారు. సినిమా అవుట్ పుట్ పట్ల పవర్ స్టార్ చాలా సంతోషంగా ఉన్నారని, తమపై ఉన్న ప్రేమను కూడా ఆయన చూపించారని థమన్ చెప్పారు. అంతేనా, ఇంకో విషయం కూడా పవన్ కళ్యాణ్ గురించి థమన్ షేర్ చేసుకున్నారు.
Also Read- OG Movie: లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు.. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్!
ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు
ఆ విషయంలోకి వస్తే.. ‘వాషి యో వాషి’ ట్రాక్ రికార్డింగ్ సమయంలో పవర్ స్టార్‌ను ఓజీ హుడీ ధరించమని అడిగామని, ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే దానిని వేసుకున్నారని, అది స్టూడియోలో జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్ అని థమన్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని థమన్ ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రస్తావించడంతో.. దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ‘ఖుషి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే అంటే, మరో బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ ఖాతా పడబోతున్నుట్టే అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ, థమన్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ స్పెషల్ కార్యక్రమానికి ‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ‘ఓజీ’ టైటిల్‌తో ఉన్న చీర ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపరచడం విశేషం.
Also Read- Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి
న్యూ పోస్టర్స్ వదిలారు
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ప్రాణం పెట్టి సంగీతం అందిస్తున్నారు. ‘ఓజీ’తో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగులోకి అరంగేట్రం చేస్తుండగా, ఇప్పటికే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. ఇమ్రాన్ హష్మీపై ఓ సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు