Abhinav Sardar Bday
ఎంటర్‌టైన్మెంట్

Tollywood Hero: పుట్టినరోజున ఈ హీరో ఏం చేశాడో చూశారా?

Tollywood Hero: కొన్ని కార్యక్రమాలు మనసును టచ్ చేస్తుంటాయి. అలాంటి కార్యక్రమాన్నే ఇప్పుడు టాలీవుడ్ హీరో, నిర్మాత, వ్యాపారవేత్త అయినటువంటి అభినవ్ సర్ధార్ చేసి అందరి మన్ననలను అందుకుంటున్నారు. మాములుగానే సేవా కార్యక్రమాల్లో ముందుండే అభినవ్ సర్ధార్ ఈ సంవత్సరం తన పుట్టినరోజును చాలా అర్థవంతంగా జరుపుకోవడం విశేషం. మాములుగా సెలబ్రిటీస్ ఎవరైనా సరే, బర్త్ డే అంటే పెద్ద పార్టీలు ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అదీ కాదంటే, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటాం. కానీ, వీటన్నింటికీ భిన్నంగా అభినవ్ సర్ధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీకి మద్దతుగా ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇలాంటి ఆలోచన ఆయనకు రావడం చాలా గొప్ప విషయం అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా.. అభినవ్‌ను అభినందించారంటే, ఎంత గొప్పగా ఆయన ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు.

వారి విశేష సహకారం

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు ఫిలిం ఛాంబర్ (2వ అంతస్తు), ఫిలిం నగర్‌లో ప్రారంభమై, సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సినీ, సామాజిక వర్గాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొని విశేష స్పందన కనబరిచారు. రామ్‌కీ మీడియా, సుహర్త్ ఫౌండేషన్, రాజమాత ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి విశేష సహకారం అందించినట్లుగా తెలుస్తోంది. రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సహాయం అందించడానికి, అవగాహన పెంచడానికి ఇలా అందరూ కలిసి రావడం మంచి పరిణామంగా భావించాలి.

Also Read- Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి

ఇలాంటివి మరెన్నో చేయాలి

ఈ సందర్భానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. రామచందర్ నాయక్ (ఎంఎల్ఏ, గవర్నమెంట్ విప్ & డిప్యూటీ స్పీకర్).. అభినవ్ సర్ధార్ చేపట్టిన ఈ సామాజిక బాధ్యతను అభినందించి, ఇలాంటివి మరెన్నో చేయాలని, అభినవ్‌ను చూసి ఎంతో మంది ఇన్‌స్పైర్ అయ్యి, ఇలాంటి మంచి పనులు చేయాలని కోరారు. ఇంకా సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, నటులు శ్రీధర్ రావు, వాసు, శ్రవణ్, మధునందన్, అఖిల్ కార్తీక్, షానీ, సుధీంద్ర.. నటీమణులు పాయెల్ ముఖర్జీ, ప్రీతి సుందర్ వంటి వారంతా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ శిబిరం రక్తదానం కోసం వేదికగా నిలవడమే కాకుండా.. దయ, ఐక్యత, మంచి మనసు.. అనే విలువలను సమాజంలో వ్యాప్తి చేసినట్లయింది. వేడుకను సేవతో కలిపిన అభినవ్ సర్ధార్ ప్రయత్నం వ్యక్తిగత మైలురాళ్లను ప్రజాహిత కార్యక్రమాలుగా మార్చే ప్రేరణాత్మక ఉదాహరణగా నిలిచిందని అంతా కొనియాడారు.

Also Read- Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!

ఇదే అసలైన వేడుక

ఈ సందర్భంగా అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ.. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థలసేమియా గురించి మరింత అవగాహన పెంచడం, రక్తదానం ఎంత అవసరమో తెలియజేయడం చాలా ముఖ్యమని భావించాను. పుట్టినరోజులు మనకు ఆనందం ఇచ్చే సందర్భాలు అయితే, ఆ ఆనందాన్ని సమాజానికి పంచడమే అసలైన వేడుక అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు