Thatikonda Rajaiah: పదవులు అనుభవించడంలో ఐకాన్ కడియం..
Thatikonda Rajaiah (image credit: swetcha twitter)
నార్త్ తెలంగాణ

Thatikonda Rajaiah: పార్టీలు మారడం, పదవులు అనుభవించడంలో ఐకాన్ కడియం.. మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

Thatikonda Rajaiah: పార్టీలు మారడం, పదవులు అనుభవించడంలో కడియం శ్రీహరి ఐకాన్ అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టడం కడియం దివాలకోరు తనానికి నిదర్శనమని అన్నారు. కడియం విడుదల చేసీన జీవోలు, ప్రొసీడింగ్ కాపీలు అబద్దాలని వాటిని మీడియా సమావేశంలో తగులు పెట్టారు.

 Also Read: Suryapet: పసిబిడ్డ కాళ్లు పట్టుకుని.. నేలకేసి కొట్టి చంపిన తండ్రి.. సూర్యపేటలో దారుణ ఘటన

శ్రీహరి శ్వేత పత్రం విడుదల చేయాలి

రెండేళ్లలో చేసిన అభివృద్దిపై కడియం శ్రీహరి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్పార్టీలు మారడం, పదవులు అనుభవించడంలో ఐకాన్ కడియం.. మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్! చేశారు. తెలంగాణలో ఫిరాయింపులే జరుగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగ బద్దంగా స్పీకర్ ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో స్పీకర్ పై కోర్టుకు వెళ్తామన్నారు.\

పరువు నష్టం దావాలకు సిద్ధంగా ఉండాలి

కడియం అనుచరులు నన్ను కించపరిచేలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని, నావ్యక్తిగత విషయాల్లో తొంగి చూడొద్దని రాజకీయాలు మాత్రమే మాట్లాడాలని అన్నారు. హద్దు మీరితే ఇకనుండి పరువు నష్టం దావాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు ఆకుల కుమార్, మారపాక రవి, మాచర్ల గణేష్, జనగామ యాదగిరి, రాకేష్ రెడ్డి, మారపల్లి ప్రసాద్, గుండా మల్లేష్, ఆకారపు అశోక్, ఈర సింగ్, సురేష్ కుమార్, దుర్గాప్రసాద్, ఉడుగుల భాగ్యలక్ష్మి, కర్ర సోమిరెడ్డి, మాలోత్ రమేష్ నాయక్, రాజన్ బాబు పాల్గొన్నారు.

 Also Read: Telangana politics: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వక్ఫ్​ చట్టం వార్!

బతుకమ్మ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ చారిత్రాత్మక వేయి స్తంభాల ఆలయం వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్, పోలీస్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డిసిపి షేక్ సలీమా, ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుద్దీపాలను అమర్చాలని, తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారు కాబట్టి మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో బందోబస్తులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఏసీపీ నరసింహారావు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read: GHMC: స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణ ప్రైవేటుపరం.. బల్దియా నిర్ణయం

Just In

01

Jishnu Dev Varma: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ద‌ర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ!

Oppo Reno 15 Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లోకి రానున్న Oppo Reno 15 Series 5G

Champion: ఛాంపియన్‌తో ఛాంపియన్.. నితీష్ కుమార్ రెడ్డి ఫేవరేట్ హీరో, హీరోయిన్లు ఎవరంటే?

MLA Rajesh Reddy: అమ్మాయిలు చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉండాలి : ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

AI Generated Content: కీలక నిర్ణయం తీసుకున్న మెటా.. రాజకీయ AI వీడియోలు తొలగింపు