Uttam Kumar Reddy: తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35 వేల కోట్లు, సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ హరీష్ రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తేల్చి చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే అన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్ రావు చెబుతున్నట్లు 35 వేల కోట్లతో తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం, 4.47 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అని చెబుతున్నదాంట్లో అణువంతు నిజం లేదని స్పష్టం చేశారు. అది పూర్తిగా నిరాధారపూరితమైనదని, ఆయన మాటలు సత్యదూరమైనవని, పూర్తి అబద్దాలు అని మండిపడ్డారు.
Also Read: Shiva re-release: కింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘శివ’ సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్..
తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంచనాల ప్రక్రియనే మొదలు పెట్టలేదని, అలాంటప్పుడు హరీష్ రావు ఇవీ అంచనాలు అంటూ ఎలా నిర్దారణకు వచ్చారని ప్రశ్నించారు. అన్నింటికీ అతి తెలివి తేటలు వినియోగించకూడదని, ఇటువంటి అతితెలివి తేటలతో ప్రజా క్షేత్రంలో అభాసు పాలవుతారని హరీష్ రావు కు హితవు పలికారు. సత్యదూరమైన ఇటువంటి ప్రకటనలు హరీష్ రావు అతతెలివి తేటలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఇటువంటి ప్రకటనలపై తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోంద
ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోంది
తుమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు సంబంధించిన అంచనాలు రూపొందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి సాగు, ప్రజలకు సాగు నీరందించేందుకు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం చేశామని పేర్కొన్నారు.
Also Read: India vs Oman: ఒమన్‌పై టాస్ గెలిచిన టీమిండియా… ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుచేయాలన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం కలిసి ఎన్నికల సమయంలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో వారు ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించారు.
గీత కార్మికులు 20 నెలలుగా హామీల అమలు
కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గీత కార్మికులు 20 నెలలుగా హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని మంత్రికి వివరించారు. మద్యం దుకాణాల్లో 25 శాతం టాడి ట్యాపర్స్ ఫెడరేషన్ సంఘాలకు కేటాయించాలన్నారు. ప్రమాద మరణాలపై కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. జీవో 560 ప్రకారం 5 ఎకరాల సాగు భూమి కేటాయించాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి తాడి ట్యాపర్స్ ఫెడరేషన్ ను ఏర్పాటుచేయాలన్నారు. కాలపరిమితి ఎన్నికలతో రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
Also Read: Deepika Padukone: ‘కల్కీ’ నుంచి తప్పించిన తర్వాత దీపికా పదుకొణె ఏం చేస్తుందంటే?