Temple Land Scam: ఆలయ భూములను కబ్జాదారులనుంచి వెనక్కి తీసుకునే కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఏ ఆలయం పరిధిలో ఎంత భూమిని కబ్జా(Occupy land) చేశారనే వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే ఆక్రమణదారులపై ఇండోమెంట్(Endowed) అధికారులు కేసులు పెట్టినవి కొన్ని, మరికొన్ని కబ్జాదారులే తమ భూమి అని, సాగుచేసుకుంటున్నామని కేసులు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1146 కేసులు ఆలయ భూములపై ఉన్నాయని అధికారులే పేర్కొంటున్నారు.
భూములపై పర్యవేక్షణ
రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణకు ప్రభుత్వ భూమిని కేటాయించింది. అలా తెలంగాణ(Telangana)లో 87235.39 ఎకరాలను కేటాయించినట్లు దేవాదాయశాఖ(Endowment Department) రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే అందులో ఒక్క ఎకరంకాదు.. రెండు ఎకరాలు కాదు ఏకంగా20వేల ఎకరాలు కబ్జాకు గురైందని దేవాదాయశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వాటిని కాపాడాల్సిన గత ప్రభుత్వాలు చోద్యం చూడటంతోనే ఆక్రమణకు గురైనట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు మండల స్థాయిలో ఈఓ, జిల్లా కేంద్రంలో జిల్లా అధికారి, ఉమ్మడి జిల్లాలకు అసిస్టెంట్ కమిషనర్లు నిత్యం ఆలయాలు, భూములపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ ఒక్కో ఈ(EO)ఓలకు ఒకరికి రెండు లేక మూడు మండలాలకు బాధ్యతలు అప్పగించడంతోనూ పర్యవేక్షణ లోపించడంతోనే ఆక్రమణకు భూములు గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వాలకు సైతం శాఖపై పట్టుకోలేక పోవడం, అధికారుల పని విధానంపై పర్యవేక్షణ లేని కారణంగానే భూములను ఎవరికి తోచిన విధంగా వారు ఆక్రమించుకున్నారని పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తిరిగి స్వాధీనం
ఆక్రమణ దారులు కోర్టులను ఆశ్రయించడంతో ఏళ్లతరబడి కోర్టులోనే పెండింగ్ లో ఉంటుంది. అందుకు ప్రభుత్వం జీపీ( గవర్నమెంట్ ప్లీడర్లు) సైతం నియమించింది. కానీ కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో పరిష్కారం కావడం లేదని సమాచారం. అయితే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి సురేఖ ఆక్రమణకు గురైన భూములపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆలయ భూములపై సుమారు 1146 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా సికింద్రాబాద్ లో 286 కేసులు ఉండగా, రంగారెడ్డిలో 270 కేసులు , హైదరాబాద్ లో 175 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో నలుగురు డిప్యూటీ తహసీల్దార్లను నియమించి నిత్యం పర్యవేక్షణ చేపడుతున్నారు. అయినప్పటికీ ఆలయ భూములు స్వాధీనం ప్రభుత్వానికి సవాల్ గా మారింది.
Also Read: OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?
20124.03 ఎకరాల ఆక్రమణ
రాష్ట్రంలో 87235.39 ఎకరాలు ఆలయ భూములు ఉండగా ఏకంగా 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కాగా విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్(Mehabubnagar) జిల్లాలోనే భూములు ఎక్కువగా ఆక్రమణకు గురయ్యాయి. ఆ జిల్లాలో 5522.22 ఎకరాలు ఉండగా అందులో 3018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. రెండోస్థానంలో మేడ్చల్(Medchel) జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4125.03 ఎకరాల్లో 2888.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. మూడోస్థానంలో హైదరాబాద్(Hyderabad) జిల్లా ఉంది. 5718.01 ఎకరాలు, 6 కిస్తాన్ ఉండగా 2374.25 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఇలా అన్ని జిల్లాల్లోనూ ఆలయభూములు ఆక్రమణకు గురైంది. భూపాలపల్లి జిల్లాలో 194.18 ఎకరాలు, కొమురంభీం ఆసీపాబాద్(Komurambheem Asipabad) జిల్లాలో 184.01 ఎకరాలు, మంచిర్యాల(Manchiryala)లో 92.03 ఎకరాలు ఆలయ భూములు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతో ఒక్క ఎకరా కూడా కబ్జా కాలేదని అధికారులు తెలిపారు.
నేడు జీపీ, ఏసీలు, కమిషనర్లతో మంత్రి సమావేశం
ఆలయ భూములు ఆక్రమణకు గురవుతుండటం, ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉండటంతో మంత్రి సురేఖ(Min Konda Sureka) శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి హాజరుకావాలని జీపీలు, ఏసీలు, కమిషనర్లతో సమావేశం అవుతున్నారు. ఏ కేసు ఎంతవరకు వచ్చింది.. దానిని ఎలా పరిష్కరించాలి.. ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు పోవాలనేదానిపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే జీపీల పనితీరుపై మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జేపీ(ప్రభుత్వ ప్లీడర్)లకు ప్రభుత్వం లక్షల్లో వేతనాలు ఇస్తున్నప్పటికీ కేసుల పరిష్కారం ఆస్థాయిలో జరగడం లేదని, నైపుణ్యం కలిగిన వారిని తీసుకుంటే పరిష్కారం మార్గం లభిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. అయితే జీపీలను మారుస్తారా? లేకుంటే పాతవారినే కొనసాగిస్తూ ఏమైన టార్గెట్ విధిస్తారా? అనేది కూడా ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి సవాల్ గా మారిన భూముల స్వాధీనంపై ఎలా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
Also Read: Vote Chori Row: రాహుల్ గాంధీ ‘ఓటు చోరీ ఆధారాల’పై ఎలక్షన్ కమిషన్, బీజేపీ ఘాటు స్పందన