GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరవాసులకు అత్యవసర సేవలందించటంతో పాటు జీహెచ్ఎంసీ(GHMC) ప్రస్తుతం రోడ్ సేఫ్టీపై ఫోకస్ చేసింది. వర్షాకాలానికి ముందే వినాయక నిమజ్జనాన్ని దృష్టి లో పెట్టుకుని రోడ్ సేఫ్టీ పేరిట వేలాది సంఖ్యలో గుంతలను పూడ్చిన జీహెచ్ఎంసీ ఇపుడు ఆ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసేందుకు సిద్దమైంది. ఎక్కడైన రోడ్లు గుంతలమయమైనా, వెంటనే మరమ్మతులు చేసేందుకు వీలుగా సిటీలోని మొత్తం 150 డివిజన్లకు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేవాలని యోచిస్తుంది. ప్రస్తుతమున్న విధానం ప్రకారం రోడ్ల మరమ్మతులకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రజలు ఫిర్యాదులు చేసినా, జవాబుదారి తనం లేకపోవటం, రోడ్లపై ఏర్పడుతున్న గుంతలను సకాలంలో పూడ్చకపోవటంతో ప్రమాదాలు జరగటం, పలు సార్లు పౌరులు ప్రాణాలు కూడా కొల్పొయిన ఘటనలు సైతం ఉన్నాయి. ఇకపై రోడ్ల మరమ్మతుల విషయంలో ఇంజనీరింగ్ మెయింటనెన్స్ విభాగం మరింత జవాబుదారిగా, పారదర్శకంగా పనులు చేసేందుకు సిటీలోని మున్సిపల్ డివిజన్ల వారీగా స్పెషల్ యాప్ ను తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది. మొత్తం సిటీలోని 150 డివిజిన్లలో ఈ యాప్ పనితీరు, రోడ్ల మరమ్మతులు, దానికి విధించిన డెడ్ లైన్ లో మరమ్మతులు జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కమిషనర్ కర్ణన్ నేరుగా మానిటరింగ్ చేసేలా ఈ యాప్ ను రూపకల్పన చేస్తున్నట
అసిస్టెంట్ ఇంజనీర్లదే కీలక బాధ్యత
రోడ్ సేఫ్టీ విషయానికి సంబంధించి జీహెచ్ఎంసీ త్వరలోనే డివిజన్ల వారీగా అందుబాటులోకి తేనున్న యాప్(App) లో ఆ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్లు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్లు(Assistant Engineers) తమకు కేటాయించిన డివిజన్ లో ఫీల్డు లెవెల్ విధులు నిర్వహించి, రోడ్లపై గుంతలను గుర్తించాల్సి ఉంటుంది. గుర్తించిన గుంత ఉన్న ప్రాంతం, ల్యాండ్ మార్కును సూచిస్తూ యాప్ లో ఫొటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక, గుంత ఉన్న ఏరియాకు సంబంధించి మెయింటనెన్స్ ఇంజనీరింగ్ విభాగానికి కూడా సమాచారమిచ్చి, ఆ గుంతను వీలైనంత త్వరగా పూడ్చి, పూడ్చిన తర్వాత పనులు చేపట్టినట్లు సూచిస్తూ మళ్లీ స్పెషల్ యాప్ లో ఫోటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని తెల్సింది. గుంత గుర్తించిన వెంటనే, ఆ గుంతను పూడ్చేందుకు సిబ్బంది పనులు నిర్వహిస్తున్న ఫొటోతో పాటు గుంత మరమ్మతులు పూర్తయిన తర్వాతి ఫొటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్లు యాప్ లో ఫొటోలు అప్ లోడ్ చేసిన తర్వాత కమిషనర్ నేరుగా యాప్ ను మానిటరింగ్ చేస్తూ ఎక్కడైనా గుంతలను పూడ్చటం ఆలస్యమైనట్టు గుర్తిస్తే, సదరు అసిస్టెంట్ ఇంజనీర్ పై కమిషనర్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: Telangana Tourism: హైదరాబాద్లో 12 వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రణాళికలు.. అవి ఏమిటంటే..?
సీఆర్ఎంపీ రోడ్లపైనే ప్రధాన దృష్టి
కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) కింద ఇప్పటికే జీహెచ్ఎంసీ సుమారు 800 కిలోమీటర్ల పొడువు గల రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించిన సంగతి తెల్సిందే. మలి విడతగా సీఆర్ఎంపీ-2 కింద సుమారు 1100 కిలోమీటర్ల రోడ్డుకు అయిదేళ్లు పాటు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేందుకు రూ. 2828 కోట్లతో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ఇటీవలే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపటంతో పరిపాలనపరమైన ఆమోదం కోసం అధికారులకు సర్కారుకు పంపారు. సర్కారు నుంచి అనుమతులు రాగానే రెండో దశగా 1100 కిలోమీటర్ల రోడ్డు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. కొద్ది ఏళ్ల క్రితం సీఆర్ఎంపీ(CRMP) కింద సుమారు 800 కిలోమీటర్ల రోడ్డును అయిదేళ్లు పాటు రూ. 1800 కోట్లకు ప్రైవేటు సంస్థలకు జీహెచ్ఎంసీ(GHMC) అప్పగించిన తర్వాత సీఆర్ఎంపీ రోడ్లపై నిర్వహణపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు కనీసం రెండో విడత సీఆర్ఎంపీ కింద నిర్వహణ బాధ్యతలను చేపట్టే సంస్థలను జవాబుదారి చేసేందుకు నిర్వహణ బాధ్యతలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఈ రోడ్ సేఫ్టీ స్పెషల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైనట్లు సమాచారం.
Also Read: Manchu Manoj: నా బిడ్డ మహవీర్ లామా.. అని అమ్మ అంటుంటే.. !
