OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజీ” (They Call Him OG) చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 25, 2025న విడుదలకు సిద్ధమవుతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. మేకర్స్ వరుసగా క్యారెక్టర్ పోస్టర్స్‌తో రిలీజ్ చేస్తూ.. సినిమా జోష్‌ను పెంచుతున్నారు. అర్జున్ దాస్ లుక్ విడుదల కాగా, ఈ రోజు ప్రకాష్ రాజ్ (సత్య దాదా) లుక్ రిలీజ్ చేశారు.
ఇంకా వారం రోజుల్లో మరిన్ని పాత్రల పోస్టర్లు వస్తాయని తెలిసిన సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా మాస్ లుక్‌లో, పవర్‌ఫుల్ డైలాగ్స్, హై-ఓల్టేజ్ యాక్షన్‌తో ఫ్యాన్స్ కు థియేట్రికల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి.
సినిమా U/A సర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని, రిలీజ్ కు సిద్ధంగా ఉంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునేలా రూపొందింది. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తొలి తెలుగు చిత్రంలో విలన్‌గా మెరవనుంది.
అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, షామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై భారీ బడ్జెట్‌తో, టాప్ టెక్నికల్ టీమ్‌తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. థమన్ సంగీతం అందించిన పాటలు సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. రిలీజ్‌కు వారం మాత్రమే మిగిలి ఉండటంతో, ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో, ట్రైలర్ అప్డేట్ రానుంది, ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌తో హైప్‌లో ఉన్న “ఓజీ” ట్రైలర్‌తో మరింత జోష్ నింపనుంది. మొత్తంగా, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో “ఓజీ” ఫ్యాన్స్ తో మాస్ ప్రేక్షకులను సైతం ఆకర్షించనుంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Also Read: Mahesh Kumar Goud: కవితకు విలీన దినోత్సవానికి ఏం సంబంధం?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్