Beauty Movie
ఎంటర్‌టైన్మెంట్

Beauty Movie: ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అంటే కుదరదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Beauty Movie: అంకిత్ కొయ్య (Ankith Koyya), నీలఖి (Nilakhi), నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యూటీ’ (Beauty Movie). ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల (Vijaypal Reddy Adidhala) నిర్మించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా, జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా.. అంటే కుదరదు

‘‘సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ శాతం ఒకటి లేదంటే రెండు మాత్రమే. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా.. అంటే ఇక్కడ కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా, సినిమాలను నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో వైవిధ్యమైన సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను. అందుకే ‘త్రిబాణదారి బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను. నెక్ట్స్ హారర్, కామెడీ ప్రధాన చిత్రాలను నిర్మించే ప్లాన్‌లో ఉన్నాను.

Also Read- Heroine: ఒక్క సినిమాలో చేసేందుకు.. ఈ నటికి రూ. 530 కోట్ల పారితోషికం.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

మనసుని కదిలించే ఎమోషన్స్

‘బ్యూటీ’ జర్నీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ చాలా బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి సినిమా బాగా రీచ్ అయింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పటి వరకు ఈ సినిమాను చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం, ఆ తర్వాత ప్రేక్షకులు ఇచ్చే రిపోర్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ ‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటు, మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తప్పనిసరిగా చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగిన చిత్రమిది. నాకు పర్సనల్‌గా ఇందులోని ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే.. నిర్మించేందుకు ముందుకు వచ్చాను.

Also Read- OG Ticket Price: బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000.. సింగిల్ స్క్రీన్, మల్టీ‌ప్లెక్స్‌లలో టికెట్ ధరలు ఎంతంటే?

హీరోయిన్‌ని మార్చాం

‘బ్యూటీ’ కథ విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే ఈ సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. సినిమా విడుదల విషయంలో వారి సహకారం మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మౌత్ టాక్‌తో తర్వాత మరిన్ని థియేటర్స్ పెరుగుతాయని భావిస్తున్నాను. ఈ సినిమాకు బడ్జెట్ పెరగడానికి కారణం ఉంది. అదేంటంటే.. సినిమా ప్రారంభంలో వేరే హీరోయిన్‌తో కొంత వరకు షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు పాటు ఆ హీరోయిన్‌తో షూటింగ్ చేశాం. ముందుగా రైటరే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్‌ పక్కింటి అమ్మాయిలా ఉండాలని అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు ఆమె అంతగా సెట్ అవ్వడం లేదని అనిపించింది. అప్పుడే నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అవడంతో బడ్జెట్ కాస్త పెరిగింది. ఈ మూవీని ఇప్పటి వరకు చూసిన వారంతా చాలా హ్యాపీగా పీలయ్యారు. కొందరైతే ‘బేబీ’ (Baby), ‘కోర్ట్’ (Court) సినిమాల తరహాలో ఉందని మెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా ఇది అని ప్రశంసించారు. వారు అలా అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా తర్వాత చిత్రం త్వరలోనే ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు