HYDRA: పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా(HYDRA) పాడింది. దాదాపు 1600 గజాలున్న ఈ భూమి విలువ రూ. 16 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం, మూసాపేట సర్కిల్ పరిధిలోని సనత్‌నగర్ కోపరేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్ లో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్లతో ఈ లే ఔట్‌ను వేశారు. ఇందులో 1200 గజాల స్థలాన్ని పార్కుల కోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్రమణలకు గురవుతున్నట్టు మోతినగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, కబ్జా అయినట్లు నిర్థారించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టినట్లు అధికారుల వెల్లడించారు. చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది.
Also Read: Khammam: సత్తుపల్లిలో కలకలం.. జనావాసాల్లోకి చేరిన జింక.. సింగరేణి సిబ్బంది రక్షణ!
మదీనాగూడలో మరో 600 గజాల స్థలం
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మదీనగూడ విలేజ్‌లో పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దుశించిన మరో 600 గజాల స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. శ్రీ అభయాంజనేయ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కుతో పాటు ప్రజావసరాలకు దాదాపు 600 గజాల స్థలాన్ని కేటాయించగా, అందులో గోశాల పేరుతో కొంత భాగం, పిండి గిర్నీ కోసం మరికొంత కబ్జా చేశారు. గోశాలలో ఉన్న ఆవులను ఇస్కాన్ టెంపుల్ వారికి అప్పగించి అక్కడి ఆక్రమణలను హైడ్రా తొలగించింది.