OG Ticket Price: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ సినిమా (OG Movie) విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఒక శుభవార్తను అందించింది. సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు అదనపు షోలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారికంగా జీవో జారీ చేయడంతో చిత్ర యూనిట్‌తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ‘ఓజీ’ సినిమా విడుదల రోజున, అంటే సెప్టెంబర్ 25న, రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షో టికెట్ ధరను రూ. 1000కి మించకుండా నిర్ణయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఒకరోజుకు ఐదు షోలు మించకూడదని కూడా తెలిసింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు ఉదయం 4 గంటల నుంచే షోలు ప్రారంభమవుతాయి. కానీ ‘ఓజీ’కి అర్ధరాత్రి దాటాక కూడా అనుమతి లభించడం విశేషం.
Also Read- Mirai Movie: ‘మిరాయ్’లో మంచు మనోజ్ చేసిన పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
టికెట్ల ధరల పెంపుతో జీవో విడుదల
అంతేకాకుండా, సినిమా విడుదలైన తొలి 10 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు, టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పెంపు ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ. 125 వరకు, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ. 150 వరకు పెంచుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ నిర్ణయం ‘ఓజీ’ సినిమాకు భారీగా వసూళ్లను సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెరిగిన ధరలు, బెనిఫిట్ షోల ద్వారా తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ‘హరి హర వీరమల్లు’ సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఈసారి బాక్సాఫీస్ మోత మోగిపోవడం పక్కా అనేలా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read- Viral News: సినిమా పిచ్చోళ్లు అంటే వీళ్లేనేమో.. టికెట్ల కోసం 7 ఏళ్ల బిడ్డను వదిలేశారు!
సంబరాల్లో ఫ్యాన్స్
ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మీ హీరోకు ఆ రికార్డు లేదు, ఈ రికార్డు లేదు అని ఇతర హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో.. ‘ఓజీ’తో అందరికీ ఇచ్చేస్తాం అంటూ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్ ప్రీ సేల్స్‌లో ‘ఓజీ’ రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో పెంచిన ధరలతో.. ఏ మాత్రం పాజిటివ్ టాక్ పడినా.. బాక్సాఫీస్ వద్ద సునామీని చూస్తారు అంటూ ఫ్యాన్స్ పోస్ట్‌లు చేస్తున్నారు. సెన్సార్ నుంచి కూడా యుబైఏ సర్టిఫికెట్ రావడం, సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో.. అభిమానులు ఆశపడుతున్న రికార్డులన్నీ ‘ఓజీ’ పేరుతో నమోదవ్వడం పక్కా అనేలా, అప్పుడే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దర్శకుడు సుజీత్ రూపొందించిన ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్. ఈ చిత్రానికి సంగీతం అందించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు