Harikatha Poster Launch
ఎంటర్‌టైన్మెంట్

Harikatha: ‘హరికథ’కు మంత్రి వాకిటి శ్రీహరి సపోర్ట్.. ఏం చేశారంటే?

Harikatha: ఈ మధ్యకాలంలో రాజకీయాలకు, సినిమాలకు చాలా అవినాభావ సంబంధం ఎక్కువ అవుతోంది. ఇది ఇప్పటిది కాదు.. నందమూరి తారక రామారావు కాలం నుంచి, సినిమాలు – పాలిటిక్స్ చాలా దగ్గరైపోయాయి. సినిమాలలో యాక్ట్ చేసే రాజకీయ నాయకులు కొందరైతే, సినిమాలలో నటిస్తూనే పాలిటిక్స్‌లో బిజీ అయిన నటీనటులు మరికొందరు. సినిమాలు వదిలేసి పూర్తి స్థాయిలో పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు మరికొందరు. ఇవన్నీ కాకుండా, సినిమాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొన్ని సినిమాలకు సపోర్ట్ ఇచ్చే రాజకీయ నాయకులకు కూడా కొదవలేదు. అలాంటి జాబితాలోకే ఇప్పుడు మంత్రి వాకిటి శ్రీహరి చేరారు. ‘హరికథ’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాకు తాజాగా ఆయన సపోర్ట్ అందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Mirai Movie: ‘మిరాయ్’‌లో మంచు మనోజ్ చేసిన పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

బ్రహ్మాండమైన సక్సెస్ అందుకోవాలి

కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హరికథ’ (Harikatha). ఐరావత సినీ కలర్స్ బ్యానర్‌పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు, కవిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్ కడ్లూరి, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను పశుసంవర్థక, క్రీడలు అండ్ యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు సపోర్ట్ అందించారు. ఈ సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ కావాలని కోరుతూ ఆయన చిత్ర టీమ్‌కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నారని, అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని మంత్రి కోరారు. ఒక చిన్న సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన మంత్రికి చిత్ర టీమ్ ధన్యవాదాలు తెలిపింది.

Also Read- OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. ఇక రికార్డులు బద్దలే!

టెక్నికల్‌గానూ అలరిస్తుంది

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనుదీప్ రెడ్డి (Anudeep Reddy) మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమాను రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుందని తెలిపారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. నవంబర్ 7న విడుదల కాబోతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరుతూ.. మా సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేసిన పశుసంవర్థక, క్రీడలు అండ్ యువజన సర్వీసుల శాఖల మినిస్టర్ వాకిటి శ్రీహరి సార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దర్శకుడు ఈ సినిమాను చాలా గొప్పగా తీశారు. చాలా మంచి కథ. సినిమా కూడా బాగా వచ్చింది. మస్తాన్ షరీఫ్ కెమెరా పనితనం, మహావీర్ సంగీతం, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్.. ఇలా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ కూడా ఎంతో సహకారాన్ని అందించింది. టెక్నికల్‌గానూ ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. త్వరలోనే ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు