Bhadradri Kothagudem: సారపాకలో షాకింగ్ ఘటన వెళ్లడైంది. పాడైపోయిన చాపల ఫ్రై ని వినియోగదారులకు విక్రయించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. పురుగులు ఉన్న చేపల ఫ్రై ఎలా తినాలంటూ ఉష ఫ్రైడ్ రైస్ నిర్వాహకురాలిని నిలదీశారు. వివరాల్లోకి వెళితే….బూర్గంపాడు మండలం సారపాకలోని ఉషా ఫ్యాన్సీ ఫ్రైడ్ రైస్ సెంటర్ లో ఆహార భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడింది. మంగళవారం సాయంత్రం ఈ హోటల్‌లో చేపల ఫ్రై కొనుగోలు చేసిన వినియోగదారులు చేపలు పాడైపోయి, వాటిలో నుంచి పురుగులు వస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు.
Also Read:Mahabubabad:స్నేహితుడి కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం.. మేమంతా ఉన్నాం!
ఎదురు సమాధానాలు చెబుతూ నిర్లక్ష్య ధోరణి
ఈ విషయాన్ని ప్రశ్నించిన వినియోగదారులకు షాప్ యజమాని సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురు సమాధానాలు చెబుతూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పాడైపోయిన చేపల వంటకాలను విక్రయించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. “లాభం కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారా?” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులను రంగంలోకి దించి, ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Shanmukh Jaswanth: యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 15వ విడత లో సామాజిక తనిఖీని చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించారు. మంగళవారం ప్రజావేదిక 01.04.2024 నుండి 31.03.2025 వరకు జరిగిన 513 పనులకు గానూ రూ. ఏడు కోట్ల 92 లక్షల 64 వేల 912 లకు సంబంధించి ఆడిట్ తేదీ 05.09.2025 నుండి 15.09.2025 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో తనిఖీ నిర్వహించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ పనులన్నింటికీ సంబంధించి అడిషనల్ పిడి.శిరీష ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి ప్రజావేదిక నిర్వహించారు.
20 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డుల్లో లోపాలను గుర్తించి, మిగతా 11 గ్రామపంచాయతీలకు సంబంధించిన రికార్డుల లోపాలను బుధవారం గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబుడ్స్ మెన్ లచ్చిరాం నాయక్, ఎంపీడీవో సంతోష్ కుమార్, విజిలెన్స్ అధికారి ఆశాకుమారి, పద్మనాభం, మండల స్థాయి అధికారులు, ఏపీ ఓ నాగయ్య, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సామాజిక తనిఖీ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Diwali Special Trains: దీపావళి స్పెషల్.. ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు పండగే!
