Gowra Hari: ప్రస్తుతం టాలీవుడ్‌లో గౌర హరి అనే పేరు మారు మోగుతుంది. ఎందుకంటే, తన సంగీతంతో అందరి మనసులను దోచుకున్నాడు. ‘హనుమాన్’ సినిమాకి తన భక్తిమయ సంగీతంతో ప్రాణం పోసిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, ‘మిరాయ్’ మూవీతో మరోసారి తన ప్రతిభను చాటాడు. ఈ సినిమా విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఓ వైపు ఉత్తేజకరమైన సన్నివేశాలకు వాణిజ్య సంగీతాన్ని అందిస్తూనే, మరోవైపు భక్తిపూరిత బీజీఎంతో ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేశాడు.
Also Read: Tollywood Actress: కోటి ఆఫర్ చేశారు.. వాళ్ళతో నా బెడ్ షేర్ చేసుకోలేను.. ఆ షో పై నటి సంచలన కామెంట్స్
ముఖ్యంగా ‘మిరాయ్’లోని “రుధిర కరణ.. రుధిర పవన.. రుధిర విభవ” అనే సంగీతం ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా చేసిందని చెప్పడంలో సందేహమే లేదు. అందుకే.. ఈ యువ సంగీత దర్శకుడికి తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఏర్పడింది. ‘మిరాయ్’ విజయం సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌర హరి, సినిమా గురించి, తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!
బిజీగా మారనున్న గౌర హరి.. చేతిలో నాలుగు ప్రాజెక్టులు
” మిరాయ్ ” ఒక అద్భుతమైన చిత్రం. ఇలాంటి చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంగీత పరంగా ఈ సినిమా చాలా విశిష్టమైంది. ముఖ్యంగా శ్రీరాముడు తెరపై కనిపించే సన్నివేశాలకు సంగీతం అందించడం కోసం మేము చాలా కష్ట పడ్డాము. ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత నన్ను చాలామంది కీరవాణి గారితో పోల్చారు. అది సంతోషకరమైనప్పటికీ, నాపై ఎలాంటి ఇమేజ్ ఏర్పడకుండా జాగ్రత్త పడ్డాను.’మిరాయ్’ కోసం నేను నా శైలిని కొత్తగా మార్చుకున్నాను. ఎందుకంటే, గొప్ప సంగీత దర్శకుడితో పోల్చడం ఆనందమైనప్పటికీ, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తప్పు జరిగినా అది ఆయన పేరుపై ప్రభావం పడుతుంది. అందుకే ఆ ఇమేజ్ నుంచి దూరంగా ఉన్నాను. ‘మిరాయ్’ తర్వాత పీపుల్ మీడియా పతాకం పై నాలుగు ప్రాజెక్టులకు పనిచేస్తున్నాను. అవి ‘జాంబీ రెడ్డి 2’, ‘రణమండల’, ‘కాలచక్ర’, ‘పినాక’ అని ముందు చేయబోయే ప్రాజెక్టుల గురించి చెప్పాడు. చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇంత బిజీగా మారడంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అవుతున్నారు.
Also Read: Hyderabad Collector: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి.. అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశం!