Aarogyasri: ప్రతీ సారి పబ్లిక్ ను ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇవ్వడం నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కు పరిపాటిగా మారిపోయింది. పెండింగ్ బిల్లులు అంటూ పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వంతో ఓ సారి చర్చలు చేస్తున్నామని, మరోసారి సమ్మె కు దిగుతున్నట్లు వాట్సాప్ గ్రూప్ లలో ఓ మెస్సేజ్ ను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ బంద్ పెడతామని పేషెంట్లను భయపెడుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదంటూ, రోగుల అడ్మిషన్లను తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల విడుదలపై గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్య శ్రీ బోర్డు, నెట్ వర్క్ ఆసుపత్రుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. సోమవారం పెండింగ్ బిల్లుల నుంచి రూ. 100 కోట్లు కూడా రిలీజ్ చేశారు. కానీ సమ్మె నిర్వహిస్తామంటూ నెట్ వర్క్ ఆసుపత్రులు ఓ ప్రకటనను రిలీజ్ చేశాయి. దీనిపై ఎంప్యానల్ పొందిన మరి కొన్ని ఆసుపత్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పేషెంట్లకు వైద్యసేవలు అందించే క్రమంలో ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు(Pricate Hospital) సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుందని, కానీ ప్రతి సారి సమ్మె నోటీసులు ఇస్తూ ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేయడం సరికాదంటూ ఓ సీనియర్ డాక్టర్ తెలిపారు.
సర్కార్ సీరియస్..?
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందలకు పైగానే నెట్ వర్క్ ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంప్యానల్ రూల్స్(Empanel Rules) సులభతరం కావడంతో గతంలో పోల్చితే ఏకంగా వంద ఆసుపత్రులు పెరిగాయి. దీని వలన పేషెంట్లకు వేగంగా వైద్యం అందుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొన్ని రూల్స్ ను సవరించింది. అయితే కొత్తగా ఎంప్యానల్స్ ఇవ్వొద్దని నెట్ వర్క్ ఆసుపత్రుల్లోనే ఓ టీమ్ గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీన్ని సర్కార్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రతీ సారి పెండింగ్ బిల్లులు(Pending Bills) అంటూ హాడావిడి చేసి, కొత్త ఆసుపత్రులు ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆరోగ్య శ్రీ మాటును కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు నెలల క్రిందట ఖమ్మం(Khammam) లోని ఓ ఆసుపత్రిని సీజ్ చేశారు. ఎం ప్యానెల్ పొందిన కొన్ని దవాఖాన్లలో తప్పుడు డాక్యుమెంట్లు పొందుపరిచి, బిల్లులు పొందినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్య శ్రీ ప్రాసెస్ పై బోర్డు సీరియస్ గా ఫోకస్ పెట్టడం వలన కూడా నెట్ వర్క్ ఆసుపత్రులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
Also Read: Urea Distribution: గిరిజన భవన్ లో టోకెన్లు… పిఎసిఎస్ లో బస్తాల పంపిణీ
రెట్టింపుతో ప్రచారం…
వాస్తవానికి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు రూ. 1780 కోట్లను రిలీజ్ చేసినట్లు ఆరోగ్య శ్రీ బోర్డు అధికారులుచెప్తున్నారు. ప్రస్తుతానికి కేవలం సుమారు రూ. 600 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, కానీ కొన్ని నెట్ వర్క్ ఆసుపత్రులు ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయని వివరిస్తున్నారు.ఈ స్థాయిలో నిధులు పెండింగ్ లేవని అధికారులు కొట్టి పరేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రక్రియను కొందరు టీమ్ చేస్తుందని బోర్డు ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇక సోమవారం కూడా నెట్ వర్క్ ఆసుపత్రులు ఓ నోట్ ను రిలీజ్ చేశాయి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని, అర్ధరాత్రి నుంచే అంటూ డాక్టర్ రాకేష్ పేరిట విడుదల చేశారు. దవాఖాన్లను వైద్యం నిలిపివేసి పేషెంట్లను గందరగోళానికి క్రియేట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆఫీసర్లు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీంతో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ దాదాపు 12 లక్షల మంది వరకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
Also Read: Jangaon Politics: జనగామ రాజకీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!