Nagam Janardhan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్కు గండికోట్టి సుమారు 50 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్టు(Dindi Project)కు తరలించేందుకు ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగిందని తన ప్రాణాలను అడ్డంగా పెట్టైనా నీటి తరలింపును అడ్డుకుంటానని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 36 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వివిధ ప్రాజెక్టు నుండి సుమారు ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని మండిపడ్డారు.
నల్లమల్ల బిడ్డగా నిత్యం..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalvakurthi Lift Irrigation Scheme)లో మూడు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని రెండు మోటార్లు కాలిపోయి రెండు సంవత్సరాల అవుతున్న ఎందుకు కొత్తవి బిగించ లేదని ఆయన ప్రశ్నించారు. కెఎల్ ఐ సమీపంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Ranga Reddy Lift Irrigation Scheme) పనులు ప్రారంభించే సందర్భంలోనే తాను హెచ్చరించడం జరిగిందని గుర్తు చేశారు. నల్లమల్ల బిడ్డగా నిత్యం జపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) జిల్లాలో మూడున్నర కిలోమీటర్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేస్తే పలు రిజర్వాయర్లు నిండి రైతులకు సాగునీరు అందలేదని అన్నారు.
Alsom Read: Ponnam Prabhakar: నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎక్కడంటే..?
రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా..
రాష్ట్రంలో రాజకీయాలను వ్యాపారమయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీశైలం(Srisailam) ద్వారా డిండి నీటిని తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తరలిస్తే సహించేది లేదన్నారు నల్లగొండ(Nalgonda) జిల్లాకు ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుందని తమ నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు. రాజకీయాలకు అతీతంగా అక్రమ నీటి తరలింపు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలా గౌడ్, తిమ్మాజీపేట పాండు, లక్ష్మయ్య, సత్యం, భీముడు, అహ్మద్, వెంకటేష్, విష్ణు, సుధాకర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ilaiyaraaja Live Concert: ఫస్ట్ టైమ్ ఏపీలో ఇళయరాజా సంగీత కచేరి.. ఎప్పుడంటే?
