Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రూ.5 కోట్ల వ్యయంతో పలు నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ భవనం, హై లెవెల్ బ్రిడ్జి, బి టి ,పి ఆర్, సీసీ రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar). అక్కన్నపేట మండలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కార్యాచరణ తీసుకున్నామని, గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల పరిహారం జరుగుతుందని, కాలువల భూ సేకరణకు భూములు ఇచ్చే త్యాగాలు ఉంటాయి అందరూ సహకరించాలని కోరారు. 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి మరోసారి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కూడా ఉంటాయన్నారు.
5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం
అనంతరం హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గూళ్లలింగం లావణ్య నూతన గృహ ప్రవేశ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి నూతన వస్త్రాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరీమ అగ్రవాల్, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్య లతో కలిసి బహుకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో పేదల ఇంటికల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. ఇల్లు ఒక కల ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణ వన మహోత్సవం భాగంలో భాగంగా మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు.
Also Read: Konda Surekha: ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బీసీ బహిరంగ సభ!
హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలో..
అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు, ఏ సమస్య ఉన్న విద్యార్థులు వైస్ ఛాన్సలర్, తన దృష్టికి తీసుకురావాలన్నారు. హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కాలేజీ రావడానికి చాలా కృషి జరిగిందని 30 ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ సొంత భవనాలు నిర్మిస్తామని సీఎంను తీసుకొచ్చి భవనాలకు శంకుస్థాపన చేసుకుంటామన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మ కి పూలు జల్లి పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిర్మించారని, ప్రజలంతా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కుంటలు నిండుతున్నాయని రైతులు నీటిని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని పెంచుకోవాలన్నారు. హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు టూరిజం అభివృద్ధి చేస్తున్నామని త్రాగునీరు, నీటి పారుదల పెంచుకుంటున్నామన్నారు.
నియామకాల్లో చాలా జాగ్రత్తగా..
గ్రూప్ 1 పరీక్షల రద్దుకు సంబంధించి కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు రాక్షసానందాన్ని పొందడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో వాటినన్నింటిని పరిష్కరించి దాదాపు 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో కొన్ని లోపాలున్నాయని, మరికొన్ని కారణాలతో కోర్టు ఒక నిర్ణయం తీసుకుందని కోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. ఎక్కడైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నమన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాబ్ క్యాలెండర్ వస్తోందని, ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంట వెంటనే పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగులంతా పరీక్షల సన్నద్ధతలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కోర్టు ఏదో చెప్తే దాంతో రాక్షసానందం, పైశాచికానందం పొందొద్దన్నారు. నిరుద్యోగుల పక్షన నిలబడి, వారికి అండగా ఉండి బాధ్యతగల ప్రతిపక్షంగా సూచనలు సలహాలు ఇస్తే మంచిదని సూచించారు.
Also Read: Tummala Nageswara Rao: రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి.. అధికారులతో మంత్రి సమీక్ష