Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..
Flora Saini n Srishti Varma
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు (Bigg Boss Telugu Season 9) సంబంధించి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో 9 మంది నామినేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందులో 8 మంది సెలబ్రిటీలు ఉండగా, ఒక కామనర్ ఉన్నారు. తనూజ, ఇమ్మానుయెల్, సంజన, రాము రాథోడ్, రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, శ్రష్ఠి వర్మ.. సెలబ్రిటీ లిస్ట్‌లో ఉండగా, కామనర్స్‌లో డీమాన్ పవన్ ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే సంజన (Sanjana Galrani) కెప్టెన్ కావడంతో ఆమె ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. మిగిలిన వారిలో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కామనర్ డీమాన్‌తో పాటు, ఇమ్మానుయెల్, రీతూ చౌదరి, తనూజ, రాము రాథోడ్ సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, శ్రష్ఠి వర్మ ఉన్నట్లుగా ఎప్పటి మాదిరిగానే లీక్స్ తెలియజేస్తున్నాయి.

Also Read- Sai Durgha Tej: ‘విన్నర్’ సినిమా తర్వాత అలాంటి పాటలు చేయడం మానేశా..

ఫ్లోరా సైనీ, శ్రష్ఠి వర్మ‌లలో ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే

డేంజర్ జోన్‌లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్‌లో ముందుగా సుమన్ శెట్టి (Suman Shetty) సేఫ్ అయ్యాడని, ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఎలిమినేట్ అయిన పర్సన్ ఎవరనేది కూడా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్స్ వచ్చేశాయి. ఆ లీక్స్ ప్రకారం ఎలిమినేట్ అయ్యింది శ్రష్ఠి వర్మగా టాక్ నడుస్తుంది. ఈ వారం వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్‌లో శ్రష్ఠి వర్మ (Shrashti Verma) కంటే ఫ్లోరా సైనీ (Flora Saini) స్కోర్ ఎక్కువ చేయడంతో ఆమె సేఫ్ అయిందని, అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన శ్రష్ఠి ఎలిమినేట్ అయినట్లుగా అప్పుడే వార్తలు మొదలయ్యాయి. వాస్తవానికి ఈ వారం హౌస్‌లో శ్రష్ఠి వర్మ పేరు చాలా తక్కువగానే వినబడింది. సంజన, ఫ్లోరా, ఇమ్మానుయెల్, భరణి, హరిత హరీష్ బాగా హైలెట్ అయ్యారు. కానీ శ్రష్ఠి వర్మ మాత్రం ఒక్క ఎపిసోడ్‌లో కూడా అంతగా కనిపించలేదు. ఒక్క స్విమ్మింగ్ పూల్‌లో దూకే సమయంలో మాత్రమే.. ఆమె అందరితో వావ్ అనిపించుకుంది.

Also Read- Bigg Boss Telugu 9: కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయ్.. నాగ్ హింట్ అదేనా?

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ సపోర్ట్ ఏది?

ఇదంతా హౌస్‌లో విషయం. హౌస్ బయట ఆమెపై చాలా నెగిటివిటీ ఉందనే విషయం తెలియంది కాదు. ముఖ్యంగా జానీ మాస్టర్ ఇష్యూలో ఆమె పేరు ఎలా వైరల్ అయ్యిందో తెలిసిందే. అదే ఇప్పుడామెకు శాపంగా మారింది. అదే ఇష్యూతో ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపాలని అనుకుని, కంటెస్టెంట్‌గా ఎంపిక చేసుకుంటే.. ఇప్పుడు ఓటింగ్ విషయంలో ఆమెకు అంతగా సపోర్ట్ లభించకపోవడం విశేషం. మరీ ముఖ్యంగా ఆమెకు కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, ఆయన ఫ్యాన్స్ (Allu Arjun Fans) సపోర్ట్ ఉంటుందని శ్రష్ఠి వర్మ భావించి ఉండొచ్చు. కానీ, ఆ సపోర్ట్ ఆమెకు బిగ్ బాస్‌ షోకు లభించలేదు. బహుశా, ఆమెను ఆ హౌస్‌లో చూడాలని వారు అనుకోలేదేమో. ఇక ఆమె ఎలిమినేట్ అయిందని తెలిసిన వారంతా.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ.. కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇదయ్యా మీ అసలు రూపం అంటూ వారు చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు శ్రష్ఠి వర్మ విషయంలో ఏం జరిగింది? నిజంగా ఆమెనే ఎలిమినేట్ అయిందా? లేదంటే కావాలనే ఇలా లీక్స్ ఇచ్చి, చివరి నిమిషంలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడా? తెలియాలంటే మాత్రం కొంత సమయం వెయిట్ చేయాల్సిందే..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ లింకులు తొలగింపు

Bigg Boss Buzzz: బిగ్ బాస్ బజ్‌లో తన తదుపరి లక్ష్యమేంటో చెప్పేసిన కళ్యాణ్.. ఏంటంటే?

Nirmala Jaggareddy: గాంధీ పేరు తొలగించడం జాతికే అవమానం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!

Pregnant Murder: కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతైన కూతుర్ని చంపేసిన తండ్రి

Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు