Bigg Boss 9 Nag Episode
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయ్.. నాగ్ హింట్ అదేనా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎండింగ్‌లో ఎవరు వస్తారో తెలుసు కదా?.. సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటెస్టెంట్స్ ఆడితే.. శని, ఆదివారాలు కంటెస్టెంట్స్‌తో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఆడుకుంటారు. ఆ విషయం తెలియంది కాదు. ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ తర్వాత కింగ్ నాగార్జున ఎపిసోడ్ వచ్చే సమయం ఆసన్నమైంది.. అంటే, ఎలిమినేషన్‌కు సమయం ఆసన్నమైందన్నమాట. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరనేది చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మలతో పాటు సుమన్ శెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా టాక్ వినబడుతోంది. మరి ఈ ముగ్గురు లోంచి ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ డే 6, అదే నాగ్ ఎపిసోడ్‌కి సంబంధించి టీమ్ ఓ ప్రోమోని విడుదల చేసింది. (Bigg Boss Telugu 9 Day 6 Promo)

Also Read- Nidhhi Agerwal: ‘మిరాయ్’ సక్సెస్‌.. పాపం.. నిధి పాప ఫీలవుతోంది!

కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయ్

ఈ ప్రోమో చూస్తుంటే.. ఎలిమినేషన్ పక్కా అనేలా కింగ్ నాగార్జున హింట్ ఇస్తున్నట్లుగా ఉంది. ఈ ప్రోమోలో హౌస్ సభ్యులందరూ టీవీ ముందు కూర్చుని నాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనని చూడగానే హౌస్‌మేట్స్ కళ్లల్లో ఆనందం కనిపించింది. కానీ ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరైనట్లుగా అర్థమవుతోంది. కింగ్ నాగ్ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ.. ఈ వారం వాళ్లు ఏమేం తప్పులు చేశారో.. అన్నీ లెక్కలతో సహా చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని బాక్సులను చూపించి.. కాసేపట్లో బాక్సులు బద్దలవబోతున్నాయ్ అంటూ చెప్పేశారు. దాంతో హౌస్ మెంబర్స్ అందరిలో హుషారు పోయింది. సంజనను, ఫ్లోరా షైనీని నిలబెట్టి.. ఈ వారం వారు ఏమేం తప్పులు చేశారో.. వివరిస్తున్నారు నాగ్. కాఫీ విషయంలో వారిద్దరి మధ్య జరిగిన ఇష్యూని హైలెట్ చేస్తున్నారు.

Also Read- Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!

గుండంకుల్ కూర్చో..

అలాగే.. ఎపిసోడ్ మొదలవ్వగానే ఫ్లోరా షైనీ పడిపోయింది. ఏంటని అడిగితే.. ‘మిమ్మల్ని చూడగానే పడిపోయాను సార్’ అంటూ కవర్ చేసింది. ఒక కొత్త పర్సన్‌ని చూస్తుంటే చాలా రిఫ్రెఫింగ్‌గా ఉంది సార్ అని సంజన అనగానే.. నాకు కూడా హౌస్‌లో రోజుకో కొత్త పర్సన్ కనబడుతున్నారని.. ఇమ్ముని ఉద్దేశించి నాగ్ డైలాగ్ పేల్చారు. ఇమ్మానుయెల్ బాగా చిక్కిపోయావే.. అంటే.. ‘మొత్తం సాంబారే సార్’ అని ఇమ్ము సమాధానం ఇవ్వగానే.. సరే.. కూర్చో గుండంకుల్.. తర్వాత మాట్లాడుకుందామని, నాగ్ వేసిన పంచ్‌తో అంతా షాకయ్యారు. రాము రాథోడ్ ఏం ఉతుకుతున్నావు.. ఏం ఆరేస్తున్నావు.. ఏం ఇస్త్రీ చేస్తున్నావ్.. అని నాగ్ అంటే.. మిమ్మల్ని చూడగానే అన్నీ మరిచిపోయాను సార్ అన్నాడు. మీరు మరిచిపోయారు.. నేను మరిచిపోలేదు, చాలా విషయాలు ఉన్నాయ్.. అంటూ ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారు కింగ్. ఆ తర్వాత నా ముందు కొన్ని బాక్సులు ఉన్నాయ్.. కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయ్.. అని ఓ బాక్స్‌ని ఓపెన్ చేశారు. ఫోరా, సంజనలకు క్లాస్ మొదలైంది. మొత్తంగా అయితే ఈ ప్రోమో రాబోయే ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజేసింది. మరి ఆ బాక్సులు ఏ స్థాయిలో బద్దలవుతాయో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. ఈ ఎపిసోడ్‌కు సైమన్ అవతార్‌లో కింగ్ నాగ్ రావడం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sai Durgha Tej: ‘విన్నర్’ సినిమా తర్వాత అలాంటి పాటలు చేయడం మానేశా..

Shankarpally Robbery Case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. సంచలన విషయలు వెలుగులోకి? ఏం నటించాడు భయ్యా!

Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

Teja Sajja: ప్రభాస్ కారణంగానే.. ‘మిరాయ్’ సక్సెస్‌పై హీరో తేజ సజ్జా స్పందనిదే!

Viral News: ఒక మహిళ, ఇద్దరు పురుషుల్ని ఒకే స్థంభానికి కట్టేసి కొట్టారు.. కారణం ఏంటంటే?