Donald-Trump
అంతర్జాతీయం, జాతీయం

Donald Trump: రష్యా, చైనా టార్గెట్‌గా నాటో దేశాలకు ట్రంప్ షాకింగ్ సూచనలు

Donald Trump: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ముగిసేంత వరకు నాటో (North Atlantic Treaty Organization) దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. సభ్య దేశాలన్నీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని, చైనా వస్తువులపై 50 నుంచి 100 శాతం వరకు టారిఫ్‌లు పెంచాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

ఈ మేరకు నాటో దేశాలకు, ప్రపంచానికి ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక లేఖ రాశారు. ‘‘నాటో దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించేందుకు ఏకాభిప్రాయంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలి. మీరు బాగా గమనిస్తే, ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంలో నాటో సంకల్పం 100 శాతం కనిపించడం లేదు. కొన్ని దేశాలు ఇంకా రష్యా చమురు కొనుగోలు చేస్తుండటమే నిజంగా షాకింగ్!. ఇది రష్యాతో చర్చల విషయంలో మీ స్థానాన్ని, చర్చల సామర్థ్యాన్ని బలహీనపరిచే అంశం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నాటో దేశాలన్నీ ఒకే దారిలో నడవగలిగితే తాను వెంటనే చర్యలకు సిద్ధమవుతానని ట్రంప్ చెప్పారు. ‘‘మీరు సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పండి. నేను రెడీగా ఉన్నాను” అని తన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు.

Read Also- Shankarpally Robbery Case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. సంచలన విషయలు వెలుగులోకి? ఏం నటించాడు భయ్యా!

రష్యాపై చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు నాటో దేశాలు కలిసికట్టుగా చైనాపై భారీ దిగుమతి టారిఫ్‌లు విధించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే ఈ టారిఫ్‌లను ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యానించారు. చైనాపై సమూహంగా నాటో దేశాలు ఏకాభిప్రాయంతో పని చేస్తే, అర్థరహితమైన ఈ యుద్ధాన్ని ముగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యాపై చైనా ప్రభావం గట్టిగా ఉందని, ఆ ప్రభావం తగ్గిపోవాలంటే శక్తివంతమైన టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తన సూచనలను నాటో దేశాలు అమలు చేయకపోతే, అమెరికా వనరుల వృథా అవుతాయని ట్రంప్ హెచ్చరించారు.

Read Also- Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

నాటో దేశాల తన సూచనల ప్రకారం ముందుకు సాగితే, యుద్ధం త్వరగా ముగుస్తుందని, ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగకుంటే, తన సమయాన్ని, అమెరికా శ్రమను, ధనాన్ని వృథా చేస్తున్నట్టేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే భారతీయ వస్తువులపై ఏకంగా 50 శాతం వరకు టారీఫ్‌లు విధించిన నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత్‌పై సుంకాలు విధించిన ట్రంప్, అమెరికాపై ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం గమనార్హం.

Read Also- Hanumakonda Task Force: హనుమకొండలో టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీ మొత్తంలో నిషేధ గుట్కా స్వాధీనం

Just In

01

Mirai Movie: ‘మిరాయ్’ మూవీని తిరస్కరించిన హీరో ఎవరో తెలుసా?

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!