Minister Seethakka ( IMAGE credit: swetcha reporteer)
హైదరాబాద్

Minister Seethakka: చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Minister Seethakka: మహిళా భద్రతపై త్వరలోనూ నూతన పాలసీ తీసుకురాబోతున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రకటించారు. ఈ నెల 22న మహిళా భద్రతపై మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని, వారి అభిప్రాయాల ఆధారంగా పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో శనివారం ఓహోటల్ లో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమిట్ 10వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు.

  Also Read: Jupally Krishna Rao: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. అవసరమైతే ఆయుధాలు ఇస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన

‘పిల్లలు అంటే మన భవిష్యత్తు

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. ‘పిల్లలు అంటే మన భవిష్యత్తు.. వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ.. పసి హృదయాల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి. చిన్నారి గాయపడితే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది. అందుకే పిల్లలు నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం సమాజం మొత్తం బాధ్యత’ అని పేర్కొన్నారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీ.జీ. శికా గోయల్, సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ శివప్రసాద్ రెడ్డి, మాసూమ్ యంగ్ ఇండియన్స్ చైర్ జోష్నా సింగ్ అగర్వాల్, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, మాసూమ్ కోచ్ భవిన్ పాండ్యా తదితరులు పాల్గొన్నారు.

 Also Read:Kishkindhapuri collections : ‘కిష్కింధపురి’ మొదటిరోజు కలెక్షన్స్ ఇంతేనా.. హిట్ టాక్ తెచ్చుకున్నా? 

Just In

01

Mirai Movie: ‘మిరాయ్’ మూవీని తిరస్కరించిన హీరో ఎవరో తెలుసా?

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!