Hyderabad Cyber Crime ( image CREDIT: Ai OR TWITEER)
హైదరాబాద్

Hyderabad Cyber Crime: సైబర్‌ కేటుగాళ్ల చేతిలో రూ.18వేలు స్వాహా.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు

Hyderabad Cyber Crime: సైబర్​ క్రిమినల్స్​ ఉచ్ఛులో చిక్కుకుని లక్షా 18వేల పోగొట్టుకున్న బాధితునికి హైదరాబాద్ సైబర్​ పోలీసులు(Hyderabad Cyber ​​Police) ఊరట కల్పించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి బాధితుని ఖాతా నుంచి నేరగాళ్లకు వెళ్లాల్సిన డబ్బును ఆపేశారు. సైబర్​ క్రైం డీసీపీ దార కవిత (DCP Dara Kavitha) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీ మొఘల్ పురాలో నివాసముంటున్న 48 యేళ్ల వ్యక్తి మొబైల్ ఫోన్​ కు ఆర్టీవో చలాన్ పేర ఓ ఏపీకే ఫైల్​ వచ్చింది. అదేందో చూద్దామని ఆ వ్యక్తి ఫైల్​ ను డౌన్​ లోడ్ చేశాడు.

 Also Read CM Hyd Tour: సీఎం రేవంత్ సిటీ టూర్‌కు ముహూర్తం ఫిక్స్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!

క్రెడిట్ కార్డు ద్వారా లక్షా 18వేల రూపాయల లావాదేవీలు

ఆ వెంటనే సదరు వ్కక్తి మొబైల్ ఫోన్ ఏపీకే ఫైల్ పంపించిన సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే బాధితునికి సంబంధించిన క్రెడిట్ కార్డు ద్వారా లక్షా 18వేల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా ఫోన్​ కు మెసెజీలు వచ్చాయి. దాంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఎన్సీఆర్​పీ పోర్టల్ పర్యవేక్షణ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఎ.శ్రీకాంత్ బాధితుని మొబైల్ ఫోన్ నుంచి ఏపీకే ఫైల్​ ను డిలీట్ చేశాడు. ఆ తరువాత జరిపిన విచారణలో సైబర్​ క్రిమినల్ బాధితుడు ఉపయోగిస్తున్న ఫ్లిప్​ కార్ట్, అమెజాన్​, మింత్రా యాప్​ ల నుంచి విలువైన వస్తువులకు ఆర్డర్ పెట్టినట్టుగా వెల్లడైంది.

ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీకాంత్ బాధితునికి చెందిన ఈ కామర్స్ అకౌంట్స్ లోకి వెళ్లి ఆ ఆర్డర్లన్నింటినీ క్యాన్సిల్ చేశాడు. అశోక్​ నగర్ కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలాగే ఏపీకే ఫైల్​ డౌన్​ లోడ్ చేయగా అతని అకౌంట్ నుంచి 25,532 రూపాయల మేర ఆర్డర్లు పెట్టినట్టు తెలిసింది. దాంతో ఆ ఆర్డర్లను కూడా క్యాన్సిల్ చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితుల డబ్బు పోకుండా చూసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను డీసీపీ దార కవిత అభినందించారు.

 Also Read: Aamir Khan Coolie: రజనీకాంత్ ‘కూలీ’లో నటించడం తప్పే అంటున్న అమీర్ ఖాన్!.. ఎందుకంటే?

Just In

01

Telangana Govt: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్… మండలానికో సెంట్రింగ్ యూనిట్!

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!

CM Revanth Reddy: కృష్ణా నీటి కోటా సాధించటంలో కేసీఆర్ విఫలం… సీఎం సంచలన కామెంట్స్!

Local body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ మంత్రుల కీలక నిర్ణయం!

India vs Pak Match: ‘భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్’ డిమాండ్లపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ స్పందన