Hanamkonda District: వరద వస్తేనే ఆ ఊరుకు బస్ వస్తుంది. ఇదేంటి ఎక్కడైనా వరద వస్తే బస్సులు నిలిచిపోవడం చూస్తాం కానీ వర్షం వచ్చి వరద వస్తేనే ఆ గ్రామానికి బస్సులు వస్తాయా అని ఆశ్చర్య పోవద్దు హనుమకొండ(Hanumakonda) జిల్లా కమలాపూర్(Kamalapur) మండలం మాదన్నపేట(Madhanna Peta) గ్రామానికి వర్షం వచ్చి వరద వస్తేనే బస్సు వస్తుందని ఆ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి పూర్తిస్థాయి బస్సు సౌకర్యం కల్పించాలని మాదన్నపేట గ్రామ మహిళలు శుక్రవారం శివాలయం చౌరస్తాలో రోడ్డు పై బైతాయించి ధర్నా నిర్వహించారు.
వర్షాలు వచ్చి వరద వస్తే
దీంతో ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ హనుమకొండ నుంచి పరకాల వైపు నడిచే బస్సులు అంబాల, కంఠత్మకూర్ మీదుగా పరకాల వెళుతున్నాయి. వర్షాలు వచ్చి వరద వస్తే కంఠత్మకూర్ వాగు రోడ్డుపై ప్రవహించి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పుడు బస్సులు మాదన్నపేట మీదుగా నడుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. మిగిలిన సమయంలో మా గ్రామానికి బస్సులు రావని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాకు బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: CP Radhakrishnan: కొత్త ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
బస్సులు నడపాలని డిమాండ్
మా గ్రామానికి బస్సులు నడపాలని డిమాండ్ చేసారు. రోడ్డు పై బైఠాయించిన గ్రామస్తులను లేపేందుకు పోలీసులు(Police) ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. వారం రోజుల్లో మీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారుల హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి, మహిళా సంఘం నాయకురాలు మేకల పద్మ, మహిళా సంఘం నాయకులు పల్లె రమాదేవి, డి రజిత, బీసీ సంఘము మండల అధ్యక్షులు కత్తి రమేష్. రాజమహ్మద్ మహిళా సంఘాల సభ్యులు రాధ,సుగుణ, స్వప్న, రాజమ్మ, మాలతీ పాల్గొన్నారు.
Also Read: Ritu Varma: తత్వం బోధపడినట్లుంది.. గ్లామర్ ట్రీట్‌కు రెడీ అంటూ హింట్ ఇచ్చేసిందిగా!