RV Karnan ( IMAGE crdit; swetcha reporter)
హైదరాబాద్

RV Karnan: శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించాలి.. కర్ణన్ కీలక సూచనలు

RV Karnan: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత మెరుగ్గా పని చేస్తూ భవన నిర్మాణ అనుమతులు వేగంగా మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్‌తో కలిసి టౌన్ ప్లానింగ్ విభాగం కార్యకలాపాలను జోనల్ లు, సర్కిల్ ల వారిగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు, కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదులు, లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.

 Also Read: Ritu Varma: తత్వం బోధపడినట్లుంది.. గ్లామర్ ట్రీట్‌కు రెడీ అంటూ హింట్ ఇచ్చేసిందిగా!

సెల్లార్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

సిటీలో శిథిలాస్థలో ఉన్న ఇళ్లను గుర్తించాలని, ప్రమాదం సంభవించకముందే చర్యలు చేపట్టాలన్నారు. అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగం బాగుందని, పారదర్శకతతో మరింత బాగా పని చేసి, ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవాలని కమిషనర్ సూచించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించినానంతరమే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫిర్యాదులు రిపీట్ గా వస్తున్నాయని, వాటిని మరింత పారదర్శకంగా, తిరిగి ఫిర్యాదులు రాకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ ఆదాయం వచ్చే అత్యంత ముఖ్యమైన విభాగం ప్లానింగ్ అన్న విషయాన్ని గుర్తించి, పారదర్శకంగా, వేగంగా ప్రజలకు సేవలందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, అదనపు సీసీపీలు, ఏసీపీలు హాజరయ్యారు.

 Also Read: CM Revanth Reddy: సీఎంగా తొలి గోదావరి పుష్కరాలు.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Just In

01

Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో మా అమ్మ గర్వపడుతోంది.. వీడియో వైరల్!

Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!

GHMC: మానవత్వం లేదా? కమిషనర్ స్పందించినా, డిప్యూటీ కమిషనర్ స్పందించరా?

CM Revanth Reddy: 21న సిటీలో సీఎం టూర్.. పలు అభివృద్ది పనులు ప్రారంభం!

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?