Lawyers Fight: దిల్లీ హైకోర్టులో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌కు చెందిన దాదాపు రూ.30,000 కోట్ల ఆస్తులపై విచారణ సందర్భంగా.. లాయర్లు గొడవపడ్డారు. న్యాయమూర్తి ముందు ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ఇరు పక్షాల న్యాయవాదులు మాటల యుద్ధానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బార్ అండ్ బెంచ్ ఎక్స్ ఖాతా.. లాయర్ల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. 21 సెకన్ల నిడివి కలిగిన వీడియో క్లిప్ లో అడ్వకేట్ మహేష్ జేత్మలానీ (Mahesh Jethmalani), సీనియర్ లాయర్ రాజీవ్ నాయర్ (Rajiv Nayar) గొడవ పడుతూ కనిపించారు. న్యాయమూర్తి ఎదుట రాజీవ్ నాయర్ వాదనలు వినిపిస్తున్న సమయంలో జెత్మలానీ జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
Also Read: Bengaluru: తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో బయటపడ్డ.. 20 మంది స్కూల్ విద్యార్థులు
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లల తరఫున అడ్వకేట్ మహేష్ జేత్మలానీ వాదిస్తున్నారు. వారు తమ తండ్రి ఆస్తులలో ఒక్కొక్కరికి ఐదవ వంతు వాటా కావాలని కోర్టులో వినతిపత్రం దాఖలు చేశారు. మరోవైపు లాయర్ రాజీవ్.. సంజయ్ భార్య ప్రియ తరఫున పక్షాన నిలబడ్డారు. సంజయ్ రాసిన వీలునామా ప్రకారం అతడి ఆస్తులన్నీ ప్రియకే చెందుతాయని రాజీవ్ కోర్టుకు తెలయజేస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి లాయర్ల మధ్య వాగ్వాదం చేసుకోంది. ‘పెద్దగా అరవద్దు‘ అంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.
#CourtroomExchange: Delhi High Court witnesses heated exchange between senior lawyers: “Don’t shout at me”
Karishma Kapur Hearing: In Justice Jyoti Singh’s court, tempers ran high as Senior Advocate Mahesh Jethmalani and Senior Advocate Rajiv Nayar clashed during arguments,… pic.twitter.com/Ll6Ccb5oPq
— Bar and Bench (@barandbench) September 12, 2025
Also Read: India vs Pakistan: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై పంజాబ్ కింగ్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
2024 మార్చి 21న సంజయ్ రాసినట్లు చెప్పబడుతున్న వీలునామాను.. నటి కరిష్మా కపూర్ పిల్లలు కోర్టులో సవాలు చేశారు. పిల్లల వాదన ప్రకారం.. సంజయ్ గాని, అతడి భార్య ప్రియ గాని, ఇతర కుటుంబ సభ్యులు ఎప్పుడూ వీలునామా గురించి చెప్పలేదని తెలిపారు. కాగా, సంజయ్ జూన్ 12న ఇంగ్లాండ్‌లో పోలొ మ్యాచ్ ఆడుతూ కుప్పకూలి మరణించారు. అయితే 2016లోనే కరిష్మా, సంజయ్ లకు విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ఆయన ప్రియను వివాహం చేసుకున్నారు.