TGMDC Sand Policy: ఇసుక రీచ్లలో బల్కు ఆర్డర్లు తీసుకొని వెళ్ళిన లారీలకు ఆయా రీచ్లలో లోడింగ్ లేక లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఆర్డర్లను రన్నింగ్ రీచ్లకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్(raju Goud) కోరారు. టీజీఎండీసీ(TGMDC) కార్యాలయంలో ఎండీ భవేష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ఇసుక రీచ్లలో లోడింగుకు అనుకూలంగా లేకున్నా ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం టీజీ ఎండీసీ అధికారులు బల్కుల రూపంలో ఇసుక క్వాంటిటీలు అమ్ముతున్నారని మండిపడ్డారు.
Also Read: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ లీడర్లు.. సెలక్షన్ ప్రాసెస్ షురూ
వర్షాల కారణంగా అక్కడ..
దీంతో ఒక్కొక్క లారీ యజమాని బల్కు క్వాంటిటీలు బుక్ చేసుకొని ఆయా రీచులకు వెళ్లినప్పుడు వర్షాల కారణంగా అక్కడ లోడింగ్ కు అనుకూలంగా లేకపోవడంతో లారీ డ్రైవర్లు(Lorry drivers) వారం పది రోజులు పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బల్క్ క్వాంటిటీలను ఇతర రన్నింగ్ రీచులకు ట్రాన్స్ఫర్ చేయాలని ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందన లేదన్నారు. లోడింగ్ పేరుతో కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమ వసూళ్లను కట్టడి చేయాలని, లోడింగ్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఇసుక రీతులలో లోడింగ్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లగ్గోని అంజయ్య గౌడ్, ఆకుల శ్రీనివాస్, అంతటి నరేష్ గౌడ్, గోధుమగడ్డ జంగా రెడ్డి, కొసనం శేఖర్ రెడ్డి, సింగు సంజీవరెడ్డి, బచ్చ రాజేందర్, ఆవుల వెంకటేశ్ యాదవ్, సురుగూరి మల్లారెడ్డి, లగ్గోనీ అమరేందర్ గౌడ్, సుర్వి జంగయ్య గౌడ్, వంటల గణేష్ యాదవ్, పసుల శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఒక్క ఫోన్‌తో మీ సమస్యలకు చెక్!