Nano Banana: నానో బనానా (Nano Banana) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన పదం ఇది. ఈ ఏడాది మొదలైన వైరల్ ఏఐ ట్రెండ్‌లో (AI Trend) ఇదొకటి. గూగుల్ జెమినీ యూజర్లు కొన్ని సెకన్లలో వ్యవధిలోనే చిన్నగా ఉండే, కార్టూన్ తరహా ఈ 3డీ ఫిగురిన్‌లను (చిన్న బొమ్మలు) తయారుచేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (AI) తయారవుతాయి. 2025లో ఇది బాగా ట్రెండింగ్‌గా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చిన్నచిన్న ఇమేజ్‌లు బాగా ట్రెండ్ అయ్యాయి. గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ ఆధారంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఫొటోలు లేదా ఐడియాల ఆధారంగా నిజమైనవిగానే అనిపించేలా 3డీ బొమ్మలను క్రియేటర్లు తయారు చేయవచ్చు.
నానో బనానాలు చిన్నగా, మెరిసేలా, కార్టూన్ తరహాలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఏడాది విస్తృతంగా వైరల్ కావడంతో ఈ ట్రెండ్‌కు ‘‘నానో బనానా’ అనే పేరు వచ్చింది. ఈ ఫిగురిన్లలో పెంపుడు జంతువులు, ప్రముఖులు, లేదా ఇతర వస్తువులను కూడా మినియేచర్ రూపంలో మార్చవచ్చు. చూడడానికి సరదాగా అనిపించడం, నిజమైన వాటిలా కనిపిస్తుండడంతో అనతికాలంలోనే ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. వీటిని చాలా తక్కువ సమయంలో సింపుల్‌గా క్రియేట్ చేసే వీలుండడంతో ట్రెండ్‌గా నిలుస్తున్నాయి.
Read Also- Vegetable storage: కూరగాయలను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయని తెలుసా?
ఎలా క్రియేట్ చేయాలి?
గూగుల్ జెమినీని ఉపయోగించి ఎవరైనా నానో బెనానా 3డీ ఫిగురిన్‌లను సులభంగా క్రియేట్ చేయవచ్చు. అది కూడా ఉచితంగానే తయారు చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
Step 1: గూగుల్ జెమినీ ఓపెన్ చేయాలి. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి జెమినీ వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు. లేదా, మొబైల్‌లో జెమినీ యాప్‌ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
Step 2: ఇన్‌పుట్‌ను ఎంచుకోవాలి. అంటే, 3డీ ఫిగురిన్ తయారు చేయాలనుకుంటున్న వ్యక్తి ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసే ఫొటో వ్యక్తిదైనా, పెంపుడు జంతువు ఫొటోనైనా అప్‌లోడ్ చేయవచ్చు. ఫొటో అప్‌లోడ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఫొటో లేకున్నా టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఉపయోగించవచ్చు. యూజర్ తన ఊహలో ఎలాంటి ఫిగురిన్ కావాలనుకుంటున్నాడో అర్థవంతంగా వివరిస్తే సరిపోతుంది.
Step 3: ప్రాంప్ట్ సరిగ్గా ఉండాలి. కావాల్సిన ఫిగురిన్‌ను పొందాలనుకుంటే ప్రాంప్ట్‌ను సరిగ్గా ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదాహరణగా, ‘A small, shiny, cartoon-style 3D figurine of a golden retriever puppy, in the style of a collectible toy, isolated on a plain background.’ ఈ ప్రాంప్ట్‌ను గమనించండి. బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి, ప్రాంప్ట్ ఇచ్చే ముందు ప్రతి విషయాన్ని తప్పుకుండా పేర్కొనాల్సి ఉంటుంది.
Step 4: జెనరేట్ అండ్ రిఫైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గూగుల్ జెమినీ 3డీ ఇమేజ్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఫిగురిన్ ఎలా కనిపిస్తోంది, బ్యాక్‌గ్రౌండ్, కంప్యూటర్ స్క్రీన్, ప్యాకేజింగ్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరమనుకుంటే, ప్రాంప్ట్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. దుస్తులు, స్టైల్, పోజులు మార్చుకునే వీలుంటుంది. ఒక్కసారి ఫిగురిన్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత దానిని డౌన్‌లోడ్, షేర్, అవసరమైతే 3డీ ప్రింట్ కూడా చేయవచ్చు.