Viral Video: బస్సుల్లో గొడవ పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) కు చెందిన బస్సులో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
బస్సులో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను కర్ణాటక పోర్ట్ ఫోలియో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఘటన బుధవారం (సెప్టెంబర్ 10) టుమకూరు రోడ్ లోని పీన్యా సమీపంలో చోటుచేసుకున్నట్లు తెలిపింది. వీడియోను గమనిస్తే బస్సు డ్రైవర్, మహిళా ప్రయాణికురాలు మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకనొకరు కోపంగా అరుచుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపటికే అది పరస్పర దాడికి దారి తీసింది. తొలుత మహిళ.. డ్రైవర్ వెనక వైపునకు వచ్చి అతడి చెంపపై దాడి చేసింది. అతడు దూరంగా జరుగుతున్నప్పుటికీ ఎగిరెగిరి కొట్టింది. మరోవైపు డ్రైవర్ సైతం ఆమెకు దీటుగా బదులిచ్చాడు. ఆమెను కూడా చెంపదెబ్బ కొట్టాడు. కండక్టర్ ఇద్దరినీ సముదాయించే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు.
Caught on Camera: BMTC Bus Driver and Woman Passenger in Slap Spat on Tumakuru Road
A seemingly routine BMTC bus ride on Tumakuru Road near Peenya turned dramatic when a verbal disagreement between a woman passenger and the driver escalated into a physical confrontation, with… pic.twitter.com/pGkqZNB1y5
— Karnataka Portfolio (@karnatakaportf) September 10, 2025
నెటిజన్ల రియాక్షన్..
బస్సులో జరిగిన దాడి ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా మరికొందరు డ్రైవర్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. ‘ప్రయాణికురాలే మొదట దాడి చేసింది. ఆమెను అరెస్టు చేయాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘డ్రైవర్ అంకుల్ మంచి పని చేశాడు. ఎంత సమస్య ఉన్నా మహిళ ముందుగా చేయి ఎత్తకుండా ఉండాల్సింది’ అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇంకొక యూజర్ స్పందిస్తూ.. ‘డ్రైవర్ ప్రయాణికులు ఎక్కి దిగడానికి చాలా తక్కువ సమయం ఇస్తాడు. దీనివల్ల తొక్కిసలాట, జేబుదొంగతనం జరిగే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. మెుత్తంగా ఈ వీడియోపై నెటిజన్లు కూడా రెండుగా చీలిపోయినట్లు అర్థమవుతోంది.
Also Read: Man Kills Wife: ప్రియుడితో దొరికిన భార్య.. తలలు తెగ నరికి.. బైక్‌కు కట్టుకెళ్లిన భర్త
పోలీసుల స్పందన
ఈ వీడియోపై బెంగళూరు సిటీ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతా స్పందించింది. ‘మీ ఫిర్యాదును సంబంధిత పోలీసు అధికారులకు పంపించాము. తగిన చర్య తీసుకుంటారు’ అని ట్వీట్ చేసింది.