CM Chandrababu (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు.. దసరా నుంచే అమలు.. ఖాతాల్లోకి రూ.15 వేలు!

CM Chandrababu: సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్‌’ పేరుతో తెదేపా-జనసేన-భాజపా కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ ను అమలు చేశామని అన్నారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని వెల్లడించారు.

‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీశక్తులకు, యువకిషోరాలకు వందనం. ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ. సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం. నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించాం. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు’ అని చంద్రబాబు అన్నారు.

‘సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు’
సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు.. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలని సీఎం చంద్రబాబు అన్నారు. ’57 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారు. గత పాలకులు ప్రజా వేదికను కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టింది. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారు. 93 పథకాలను నిలిపేశారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశాం. సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు. మెగా డీఎస్సీ అవ్వదన్నారు.. దీపం వెలగదన్నారు.. ఫ్రీ బస్సు కదలదన్నారు. కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రైతుల గురించి..
రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మనకు అన్నంపెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చాం. కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశాం. నీళ్లిచ్చాం.. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం.. మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశాం. ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చారు. ఆర్ధిక కష్టాలున్నా.. అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి… 2.45 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు ఇచ్చాం. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే ‘దీపం 2’ సూపర్ హిట్’ చంద్రబాబు అని అన్నారు.

కొత్త స్కీమ్ ప్రకటన
సీఎం చంద్రబాబు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో చెప్పినట్లు వాహన మిత్ర పథకాన్ని ఈ దసరా నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్కీమ్ కింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 అందజేయనున్నట్లు చంద్రబాబు అన్నారు.

Also Read: Nepal Gen Z Protest: నేపాల్ మహిళా మంత్రిని.. చావగొట్టిన నిరసనకారులు.. వీడియో వైరల్

అందుకు హామీ ఇస్తున్నాం: పవన్
అంతకుముందు సూపర్ సిక్స్ -సూపర్ హిట్ విజయోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్. పార్టీలు వేరైనా, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ 25 లక్షల ఆరోగ్య భీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాం. రూ.1005 కోట్లతో పీఎం జన్ మన్ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశాం. ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయి’ అని పవన్ అన్నారు.

Also Read: YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

Just In

01

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూశాను.. మైండ్ బ్లోయింగ్.. బెస్ట్ ఏంటంటే?

OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!

Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా సంక్షోభం.. హరీష్ రావు సంచలన కామెంట్స్

GHMC: 60 ఇందిరమ్మ టిఫిన్ స్టాళ్లకు బల్దియా సిద్దం.. ఎప్పుడు ప్రారంభమంటే?

GHMC Commissioner: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం