Mahabubabad Protest: ఇజ్రాయిల్‌ పెట్టుబడి ఒప్పందం సిగ్గుచేటు..
Mahabubabad Protest( IMAGE credit: swetcha reporter
నార్త్ తెలంగాణ

Mahabubabad Protest: ఇజ్రాయిల్‌ పెట్టుబడి ఒప్పందం సిగ్గుచేటు.. వెంటనే రద్దు చేయాలని సీపీఐ నేతల డిమాండ్!

Mahabubabad Protest: భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతంకం చేయడానికి ఇజ్రాయిల్‌ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ గత మూడు రోజులుగా భారత దేశంలో చేస్తున్న పర్యటనను తీవ్రంగా ఖండించాలని సీపీఐ (CPI) (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. స్మోట్రిచ్ భారత్ పర్యటనను నిరసిస్తూ సీపీఐ(CPI) ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహబూబాబాద (Mahabubabad) అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయెల్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ.. పచ్చి మితవాద జాత్యాహంకార పార్టీకి చెందిన స్మోట్రిచ్‌, పాలస్తీనా ప్రజలను బలవంతంగా నిరాశ్రయులను చేయడం ద్వారా గాజాస్ట్రిప్‌ను ఆక్రమించాలను కుంటున్న నెతన్యాహూ ప్రభుత్వంలో ప్రముఖ న్యాయవాదని, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ను ఇజ్రాయిల్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనకు ఆయనే ప్రధానకర్త అని అన్నారు.

Also Read: Mirai Train Stunt: ‘మిరాయ్’ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని హీరో.. ఏం చేశాడో తెలుసా?

ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం సిగ్గు చేటు 

పాలస్తీనియన్ల జాతిని హననం చేస్తున్న సామాజ్య్రవాదాన్ని వ్యతిరేకిస్తూ పలు దేశాలు స్మోట్రిచ్‌ పర్యటనపై నిషేధం విధించినా భరత దేశం ఆయనను ఆహ్వానించి గౌరవ మర్యాదలతో చర్చలు జరపటం రక్త పిపాసి ఇజ్రాయిల్ కు వత్తాసు పలకటమేనన్నారు. గాజా ప్రజలు ప్రతి రోజూ ఊచకోతకు గురవుతున్న సమయంలో మోడీ ప్రభుత్వం స్మోట్రిచ్‌కు ఆతిథ్యమివ్వడం, ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ ఒప్పందంతో మోడీ ప్రభుత్వం నెతన్యాహూ ప్రభుత్వంతో కుదుర్చుకున్న లోతైన, దృఢమైన సంబంధాలను వెంటనే విడనాడాలని అన్నారు. గాజాలో కొనసాగుతున్న మారణహోమాన్ని ఆపాలన్నారు. పాలస్తీనా పసి బిడ్డల ఉసురు తీస్తున్న ఇజ్రాయిల్ పసిపిల్లలను కూడా వదలమని చేస్తున్న అమానవీయ ప్రకటనలను మనదేశం ఖండించకపోవటం సిగ్గు చేటన్నారు.

శాంతియుత పరిష్కాం దిశగా కృషి

ఇజ్రాయిల్‌ వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించి, పాలస్తీనా సమస్యకు న్యాయమైన మరియు శాంతియుత పరిష్కాం దిశగా కృషి చేసే వరకు భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో అన్ని సైనిక, భద్రతా, ఆర్థిక సహకారాన్ని రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య,జిల్లా నాయకులు గుగులోత్ సక్రు,చింతా వెంకన్న,బట్టు చైతన్య, బోనగిరి మధు,ప్రజా సంఘాల నాయకులు ఏపూరి వీరభద్రం, గౌని భద్రయ్య,తెలబోయిన క్రిష్ణ,ఇరుగు అనిల్,రామచంద్రపు మురళీ,మెంగు భగవాన్,యాకూబ్ పాషా పాల్గొన్నారు.

 Also Read: Harish Rao: తెచ్చి చూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు ఛాలెంజ్

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..