Tribal Ashram School: గిరిజన బిడ్డల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ కు దీటుగా ఆశ్రమా స్కూళ్లకు నిధులు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆశ్రమ స్కూల్లో (Ashram School) పనులు చేయాల్సిన వాళ్లు పట్టనట్లుగా ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కారేపల్లి మండలంలోని మేకలతండా ఆశ్రమ పాఠశాల (Mekalathanda Ashram School) ఏర్పాటుచేసిన నాటినుండి ఈ స్కూల్లో అనేక అక్రమాలు వెలుగులోకి రావడం పలువురు సస్పెన్షన్లకు గురి కావడం గతంలో అనేకం జరిగాయి. పిల్లల పొట్టలు కొట్టి అక్రమంగా బయటికి తరలిస్తున్న బియ్యం, గుడ్లు తదితర సామాగ్రిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులుకు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూర్తి నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెడ్మాస్టర్ స్థానికంగా ఉండకుండా పట్టణాలనుంచి రాకపోకలు సాగిస్థూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనిచేయాల్సిన సిబ్బంది కూడా రాకపోకలు సాగిస్తూ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Pig Kidney Transplant: వైద్య రంగంలో సంచలనం.. 54 ఏళ్ల వ్యక్తికి.. పంది కిడ్నీ అమర్చిన వైద్యులు
పని వేళలు పాటించని పీఈటి
విద్యార్థులకు ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఆశ్రమ పాఠశాల పని వేళలు ఏమాత్రం పాటించడం లేదు. ఖమ్మం నుంచి వస్తున్న ఉపాధ్యాయులను తన ఆటోలో ఎక్కించుకొని అతని ఆటో డ్రైవింగ్ చేస్తూ వారు వచ్చినప్పుడు స్కూలుకు రావడం, మళ్లీ వాళ్లని ఆటోలో తీసుకొని వెళ్లడం ఇక్కడి పీఈటీ చేస్తున్న విధులు. విద్యార్థులకు ఆటలు లేవు పాటలు లేవు పర్యవేక్షణ జరపాల్సిన అధికారులు వారి విధులే సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఒకరికి బదులు ఒకరు
పాఠశాలకు చెందిన తార్య అనే ఎస్ జి టి అనారోగ్యంతో ఉంటూ ఉన్నతాధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా హెడ్మాస్టర్ తో మాట్లాడుకుని ఆయన బదులు మరో ప్రైవేటు వ్యక్తి తో ఉద్యోగం చేయిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తి క్లాసులు చెప్పడం ఇక్కడి నిర్వాహకుల ఇష్ట రాజ్యాంగానే సాగుతోంది.
అనారోగ్యంతో నిత్యశ్రీ అనే బాలిక ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆశ్రమం స్కూల్ కి వచ్చిన తర్వాత అనారోగ్య బాధితులను మేము భరించలేమని ఆ విద్యార్థినికి బలవంతంగా టీసీ ఇచ్చి పంపిన అమానుష ఘటన కూడా ఈ ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రత్యేక పర్యవేక్షణ జరపాల్సిన అధికారులు ఈ ఆశ్రమ పాఠశాల పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!