Agriculture Officer: గత రెండు నెలల నుంచి వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో యూరియాను రైతులకు పంపిణీ చేస్తున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి రైతులకు యూరియా పంపిణీ చేస్తే ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, వివాదాలు తలెత్తకుండా ఉండేవని రైతులు తెలుపుతున్నారు. అడ్డగోలుగా అందిన కాడికి తెలిసిన రైతులకు మాత్రమే యూరియాను సరఫరా చేసి మిగతా రైతులకు మొండి చేయి చూపించాడని రైతులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ అగ్రికల్చర్ (Mahabubabad Agriculture) అధికారి తిరుపతిరెడ్డి (Agriculture Officer) నిర్లక్ష్య ధోరణి తోనే రైతులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఆధార్ కార్డు ద్వారా పంపిణీ చేసిన యూరియా(Urea) మొత్తం పక్కదారి పట్టిందని విమర్శిస్తున్నారు.
Also Read: Urea Shortage: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా మంటలు.. క్యూ లైన్ లలో మహిళా రైతులు
సరైన ప్రణాళిక లేకుండా యూరియా పంపిణీ చేయడంతోనే సమస్యలు
మొదటినుంచి రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను సేకరించి జాబితా తయారు చేసి ఆ విధంగా రైతులకు యూరియాను సరఫరా చేస్తే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు జరగకుండా ఉండేవని రైతులు (Farmers) వెల్లడిస్తున్నారు. యూరియా కొరత ఉందని తెలిసి కూడా సరైన ప్రణాళిక లేకుండా యూరియా(Urea) ను నచ్చిన వారికే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపించాడని రైతులు చెబుతున్నారు. జిల్లా యంత్రాంగంపై ఈరోజు ఇలాంటి ఒత్తిడి పెరిగింది అంటే అది కేవలం మహబూబాబాద్(Mahabubabad) మండల అగ్రికల్చర్ అధికారి తిరుపతి రెడ్డి ధోరణియే కారణమని రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఫోన్ ఎత్తడు.. కంటికి కనిపించడు..
ఆ వ్యవసాయ మండల అధికారి రైతులు ఫోన్ చేస్తే ఎత్తడు.. కంటికి కనిపించడు. మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని మహబూబాబాద్ మండల రైతులు వాపోతున్నారు. సరైన ప్రణాళికతో మొదటి నుంచి ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకోకుండా పట్టాదారు పాసుపుస్తకం పరిగణలోకి తీసుకొని యూరియా పంపిణీ చేస్తే జిల్లా కేంద్రంలో పరిస్థితి ఇంత ఉద్రిక్తతగా మారేది కాదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న మహబూబాబాద్ మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి పై ఉన్నత స్థాయి అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
నాలుగైదేళ్లకు పైగా ఇక్కడే… అందుకే రైతులంటే నిర్లక్ష్యం
మహబూబాబాద్ (Mahabubabad) మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి(Tirupathi Reddy) గత నాలుగైదు ఏళ్లుగా మహబూబాబాద్ (Mahabubabad) లోని తిష్ట వేసి కూర్చున్నాడు. వ్యవసాయ శాఖలో పనిచేస్తూ రైతుల (Farmers)కు సరైన సూచనలు చేయడంలోనూ విఫలం చెందాడని విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. నాలుగైదు ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన వ్యవసాయ శాఖ అధికారి కనుసన్నల్లోనే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, పురుగు మందులు ఫెర్టిలైజర్ షాపుల్లో విక్రయాలు జరుగుతున్నాయి అనేది రైతుల నుంచి వస్తున్న ఆరోపణలు. తనిఖీల సమయంలో ఒకటి రెండు షాపులనే టార్గెట్ చేసుకొని ఆ షాపుల లోనే తనిఖీలు నిర్వహిస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు.
నిజంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మే ఫెర్టిలైజర్ షాపులపై ఇప్పటివరకు దాడులు చేయలేదంటే అర్థం ఏంటో తెలిసిపోతుంది. రైతులకు ఏమైతే నాకేం.. నాకు కావాల్సింది… ఆగ్రోస్, అగ్రి మాల్ నిర్వాహకుల నుంచి అందాల్సింది అందితే చాల్లే అనుకుంటూ విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నాడని రైతులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూరియా వివాదాలన్నింటికీ కేవలం మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి కారణమంటూ రైతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
బాధ్యతగా యూరియా సరఫరా చేయాల్సిన అధికారి గ్రామాల్లో సంచరింపు
ఆయన మండలానికి బాస్. మండల వ్యవసాయ అధికారి కింద క్లస్టర్ల వైజ్ గా ఏ ఈ ఓ లు ఉంటారు. వారంతా క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన సమస్యలు, పంట వివరాలు, అందుకు కావలసిన ఎరువులు అంచనావేసి మండల అధికారికి జాబితా అందజేస్తారు. ఈ మేరకు మండల అధికారి రైతులకు కావలసిన విత్తనాలు సహా ఎరువులు సైతం అందించేందుకు ప్రత్యేకమైన ఇండెంట్ తయారు చేసి పై అధికారులకు నివేదిక అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాల్లోనే మండల అధికారి తిరుపతిరెడ్డి తీవ్రంగా విఫలమైనట్లుగా రైతులు చెబుతున్నారు. తిరుపతి రెడ్డి నిర్లక్ష్య వ్యవహార ధోరణి వల్లే నేడు మండలంలోని రైతులంతా రోడ్డెక్కి యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మండల అధికారి తిరుపతిరెడ్డి పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంత జిల్లాలో కాకుండా వేరే దక్షిణ తెలంగాణ జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతున్నారు.
Also Read: PDSU Demands: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ యూ ధర్నా.. ఎక్కడంటే..?