Double Whorls: పెద్దల చెప్పే కథల్లో ఒక ఆసక్తికరమైన నమ్మకంఉంటుంది. అబ్బాయిలలో కొందరికి తల మీద రెండు సుడులు ఉంటాయి (హెయిర్ వోర్ల్స్). అలా రెండు కనిపిస్తే, ఆ వ్యక్తికి రెండు పెళ్లిళ్లు అవుతాయని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు విని, చాలామంది ఆశ్చర్యపోతూ, లేదా నవ్వుతూ ఉంటారు. కొందరు దీన్ని సత్యంగా నమ్ముతూ, “చెడ్డ శకునం” అని భయపడతారు. మరికొందరు “అబద్ధాలు” అంటూ కొట్టిపారేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత పాపులర్ అయింది. “డబుల్ కిరీటం” ఉన్నవాడు రెండు వివాహాలు చేసుకుంటాడని చమత్కారాలు చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, నిపుణులు దీని గురించి ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో రూ.45 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన.. డిప్యూటీ సీఎం
ఇది నిజమా? లేక కేవలం పురాణాలా? దీని వెనుక ఉన్న వాస్తవాలను ఇక్కడ చూద్దాం.. సాధారణంగా, పురుషులు, మహిళలు ఇద్దరికీ తల మీద ఒకే ఒక సుడిగుండ (సింగిల్ వోర్ల్) ఉంటుంది. ఇది ఒక వృత్తాకార గుండ్రటి ప్యాటర్న్‌లా జుట్టు పెరిగే చోటు. కానీ, కొందరికి – ముఖ్యంగా పురుషుల్లో రెండు సుడిగుండాలు (డబుల్ వోర్ల్స్) కనిపిస్తాయి. ఇది తల పైన, నెత్తి వెనుక భాగంలో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో దీర్ఘ జుట్టు వల్ల కనిపించకపోవచ్చు, కానీ పురుషుల్లో షార్ట్ హెయిర్‌తో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్త అధ్యయనాల ప్రకారం, ఇలా రెండు సుడులు ఉన్నవారు కేవలం 5% మాత్రమే.
Also Read: Hyderabad News: జీడిమెట్లలో సామాజిక కార్యకర్త అరుదైన ఆలోచన.. ప్రాణానికి కవచం గా ‘గో స్లో’ నినాదం..?
నిపుణులు ఏం చెబుతున్నారంటే?
డెర్మటాలజిస్ట్‌లు, జెనెటిసిస్ట్‌లు స్పష్టంగా చెబుతున్నారు. డబుల్ వోర్ల్స్ అనేది పూర్తిగా జెనెటిక్ ఫీచర్. ఫీటల్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో హెయిర్ ఫొలికల్స్ ఎలా పెరిగాయో దాని మీద ఆధారపడి ఏర్పడుతుంది. కుటుంబంలో ముందు తరాల్లో ఎవరికైనా ఇలా ఉంటే, మీకు కూడా ఉండే చాన్స్ ఎక్కువ. ఇది హెయిర్ కలర్ లేదా ఐ షేప్ లాంటిదే. ఒక నార్మల్ వేరియేషన్. ఇది బాల్డ్‌నెస్, ఇంటెలిజెన్స్, ఆటిజం లేదా మ్యారేజ్‌తో ఎటువంటి లింక్ లేదు.
Also Read: R.V. Karnan: శానిటేషన్ వర్కర్ల జీవితాల్లో వెలుగు.. రూ. 30 లక్షలకు పెరగనున్న కార్మికుల ఇన్సూరెన్స్