Crime News: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త అహోబిలంను భార్య పద్మావతి తన భర్తను అతి కిరాతకంగా హత్యచేయించింది.
ప్రియుడితో కలిసి తన భర్తను..
తోగల కల్లు గ్రామానికి చెందిన అహోబిలం అనే వ్యక్తి మరియు అతని భార్య పద్మావతి ఉంటున్నారు. అయితే భార్య చేసిన పనులను గుర్తించిన అహోబిలం గతంలో పలుమార్లు మందలించి గోడవకు దిగేవాడు. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఆ విషయమై గోడవలు జరిగాయి. దీంతో అతని భార్య భర్త పై పగ పెంచుకుంది. ప్రియుడితో కలిసి తన భర్తను చంపాలని వారిద్దరు కలిసి ప్లాన్ వేసుకున్నారు. అయితే గత మూడురోజుల క్రితం అహోబిలం తన ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్నాడు. తోగలగల్లు – దోండకొండ మధ్యఉన్న డంపింగ్ యార్డ్ వద్ద పద్మావతి ప్రియుడు చెన్న బసవ అహొబిలం పై దాడి చేశాడు.
Also Read: CPI Narayana: బీజేపీ – బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
అక్రమ సంబందానికి అడ్డు..
కత్తితో తనపై విచక్షణ రహితంగా దాడిచేయడంతో అహొబిలం అక్కడే కుప్పకూలి చనిపోయాడు. అనంతరం అక్కడినుండి చెన్నబసవ పారిపోయాడు. మృతుడు అహొబిలం శవం రోడ్డు పక్కన అక్కడి స్ధానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించారు. సంఘటనస్ధాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో తన అక్రమ సంబందానికి అడ్డు వస్తున్నాడని, ఈ విషయం అందరిముందు భయట పెడతాడేమో అని హత్య చేసినట్లు నిందితులు ఓప్పుకున్నారని పోలీసులు విచారణలో తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఓ మహళ తన ప్రియుడికోసం తన సోంత భర్తను చంపడంతో అక్కడి స్ధానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Also Read; PDSU Demands: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ యూ ధర్నా.. ఎక్కడంటే..?