Crime News: తమిళనాడులో ఊహించని ఘటన చోటు చేసుకుది. ఓ మహిళ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసును పంచాయతీ సర్పంచ్ దొంగిలించింది. తన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించడం లేదని కోయంబేడు పోలీసులకు నేర్కుండ్రం నివాసి అయిన వరలక్ష్మి(50) అనే మహిళ పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
వరలక్ష్మి అనే మహిళ కాంచీపురంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా బస్సులో బంగారు గొలుసు చోరీ జరిగిందని పోలీసులుకు ఫిర్యాదులో ఆ మహిళ పేర్కోంది. దీంతో వెంటనే కేసునమోదు చేసుకున్న పోలీసులు మహిళ ప్రయానించిన బస్సులోని అందరిని తనీకీ చేశారు. పోలీసుల తనిఖీలో వరలక్ష్మి పక్కన కూర్చున్న మహిళ దొంగిలించినట్టుగా పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే ఆ దొంగిలించిన మహిళను విచారించంగా ఆమె తిరుపత్తూరు జిల్లా నార్యంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి(56)గా పోలీసులు గుర్తించారు.
Also Read: Illegal Sand Mining: యథేచ్ఛగా అధికారుల అండతో.. అక్రమ మట్టి దందా?
వివిధ ప్రాంతాల్లో దొంగతనం కేసులు
పోలీసులు విచారణలో ప్రజాసేవలో ఉన్న ఓ మహిళ ఇలా ప్రవర్తించడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిందితురాలు భారతిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. గతంలో సైతం తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరు ప్రాంతాల్లో భారతిపై వివిధ ప్రాంతాల్లో దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసుల విచారణ అనంతరం తెలిపారు. ఒక సామాజిక నాయకురాలై ఉండి ఇలాంటి పనులు చేయడంతో నెటిజన్లు ఆమేపై దుమ్మెత్తిపోస్తున్నారు. నిందితురాల్ని కఠినంగా శిక్షించాలని అంటున్నారు.
Also Read: Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..