Illegal Sand Mining: హుజూరాబాద్ మండలం రంగాపూర్ శివారులోని పాండవుల గుట్టలో అక్రమ మట్టి రవాణా (Illegal Sand Mining)జోరుగా సాగుతోంది. స్థానిక అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో మట్టి మాఫియా… పగలు, రాత్రి తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నాయి. ఈ అక్రమ(Huzurabad) తవ్వకాల వల్ల ప్రభుత్వానికి రోజుకు లక్షల్లో ఆదాయం గండి కొట్టడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అక్రమ దందా యదేచ్చగా సాగిస్తున్న అధికారులు మాత్రం మొడ్డునిద్ర వీడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వ్యాపారులు కమర్షియల్ గా అధిక ధరలకు మట్టి విక్రయాలు సాగిస్తూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే నిరుపేదల వద్ద కూడ అధిక ధరలు వసూలు చేస్తున్నారన్ విమర్శలు వస్తున్నాయి.
Also Read: RBI Grade B Recruitment 2025: RBI లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..
రాత్రిపూట యథేచ్ఛగా దందా…
రంగాపూర్ గుట్టపై ప్రతిరోజూ రాత్రి 11:30 గంటల నుండి తెల్లవారుజామున 4:30 గంటల వరకు నిరంతరాయంగా తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్రమ రవాణా కోసం సుమారు 8 జేసీబీలు, 50కి పైగా టిప్పర్లను ఉపయోగిస్తున్నారని సమాచారం. రంగాపూర్, గణేష్ నగర్, కొత్తపల్లితో పాటు పరిసర గ్రామాలకు ఈ వాహనాల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. రాత్రిపూట అధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉండదని భావించి ఈ దందాను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారుల మద్దతుపై అనుమానాలు…
మట్టి మాఫియాకు అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.. లంచావతారాలు: ప్రతి జేసీబీకి రోజుకు రూ.1000, ఒక్కో టిప్పర్‌కు రూ.500 చొప్పున అధికారులకు లంచాలు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయ. లంచం తీసుకునే అధియారులు అక్రమార్కులకు ముందస్తు సమాచారం ఇచ్చి అలర్ట్ చేస్తూ టిప్పర్ డ్రైవర్లు, జేసీబీ ఆపరేటర్లకు సహకరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మట్టి అక్రమ రవాణా దారుల వద్ద తనికి చేసే పోలీస్ సిబ్బంది ఫోన్ నంబర్లు ఉండడం, తనిఖీల గురించి ముందే వారికి సమాచారం లభించడం వంటివి ఈ అక్రమాలకు అధికారుల మద్దతు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
వైఖరిలో రాని మార్పు…
గతంలో పోలీసుల సైరన్ వినగానే పరారయ్యే మాఫియా సిబ్బంది, ఇప్పుడు నిస్సంకోచంగా వారిని ఎదురుగా పలకరిస్తుండడం అధికారుల మద్దతుకు నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రశ్నార్థకంగా ప్రభుత్వ యంత్రాంగం వైఖరి మారుతుంది. ప్రభుత్వ భూముల్లో ఇంత పెద్ద ఎత్తున మట్టి తరలిస్తుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమాల వల్ల సహజ వనరుల విధ్వంసం జరుగుతోందని, భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also Read: Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలతో.. వందే భారత్ స్లీపర్ రైలు.. పండగే పండగ!