Kavitha( image credit: swetcha reporter)
Politics

Kavitha: హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ మోసం.. కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha:  బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ కులాల నాయకులతో భేటీ ఆయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. బీసీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు.

 Also Read: Rajinikanth- Kamal Haasan: ఇద్దరు పెద్ద హీరోలతో ఒక సక్సస్‌ఫుల్ దర్శకుడు.. ఇక బాక్సాఫీస్ బద్దలే

ప్రజలకు వివరణ ఇవ్వాలి

ఈ సందర్భంగా కవిత(Kavitha) మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతవరకు తెలంగాణ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పార్లమెంట్ లో ప్రస్తావించలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ సంఘాలను కలుపుకుని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాద్గించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

 Also Read: Nepal Gen Z protests: సోషల్ మీడియా‌పై ఆంక్షలు.. అట్టుడుకుతున్న నేపాల్.. పార్లమెంట్ భవనానికి నిప్పు

Just In

01

Bigg Boss Telugu 9: జానీ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా? హౌస్ లోకి వెళ్తే మోత మోగినట్టేనా?

Raj Kundra Fraud: చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాకు పోలీసులు సమన్లు.. అయినా అవేం పనులు

Nepal PM Resigns: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా.. రంగంలోకి ఆర్మీ

Bigg Boss 9 Telugu: కామనర్స్ చేతిలో బలైన హీరోయిన్? ఇక ఆ బ్యూటీ అవుటేనా?

Nepal GenZ Protests: నేపాల్‌లో అల్లకల్లోలం.. రాష్ట్రపతి భవన్‌కు నిప్పు.. ప్రధాని ఇల్లు ధ్వంసం