Akunuri Murali: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు.(Akunuri Murali) విద్య కమిషన్ సభ్యులు వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు పరిశీలించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ… ప్రభుత్వ కళాశాలలోని మౌలిక వసతులు, చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామన్నారు.
Also Read: Mahesh Babu: వారికి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు.. యూఎస్‌లో ప్రత్యక్షమైన నమ్రత
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం
ప్రభుత్వ కళాశాలలోని మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు జిల్లా కమిషన్ సభ్యులతో కలిసి వచ్చామన్నారు. అధ్యాపకుల, విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు కూడా తమ దృష్టికి వచ్చాయని అధ్యాపకుల సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) విద్యార్థులు తమకు ఇంగ్లీషు, ఉర్దూ పాఠ్యపుస్తకాలు అందుబాటు లేవని, వసతి గృహ సదుపాయాలు కల్పించాలని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
విధి విధానాలపై చర్చ
దీనిపై కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ పాఠ్యపుస్తకాల సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. డైట్ ఆవరణలో ఉన్న వసతి గృహంలో అన్ని మరమ్మత్తు పనులు చేపట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాల వరకు చేపట్టాల్సిన విద్యాబోధన విధానం, చేపట్టాల్సిన విధి విధానాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులను శాలువాలతో సత్కరించారు.
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్తో పాటు వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ , డైట్ కళాశాలలను కమిషన్ సభ్యులు పిఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారుకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి లతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, విద్యార్థుల సంఖ్య పై ఆరా తీశారు. కమిషన్ చైర్మన్ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, డీఈఓ రేణుకా దేవి, ప్రిన్సిపాల్ లు గీతా లక్ష్మీ పట్నాయక్, రామాచారి లు పాల్గొన్నారు.
Also Read: Viral Video: రెస్టారెంట్‌లో సీటు లొల్లి.. ఘోరంగా కొట్టుకున్న.. హోటల్ స్టాఫ్, కస్టమర్లు!
బోడుప్పల్ లో దొంగల హల్ చల్.. అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు..
వరుస దొంగతనలతో బోడుప్పల్ అంబేద్కర్ నగర్ కాలనీ, ఫేస్ 3 ప్రజలకు కునుకు లేకుండా పోయింది. స్థానికంగా సంచరిస్తున్న ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన బానోతూ వినోద్ కుమార్ (31) గత నెల 23 న సొంత ఊరికి వెళ్లి 30 న తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించాడు. ఇంట్లో నగదు తో పాటు 2 తులాల బంగారం, వెండి, ల్యాప్ ట్యాప్ లు కనిపించడం లేదని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. ఆ తరువాత అదే ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన మరో రెండు ఇండ్లలో కూడా దొంగలు నగదు, ఐరన్ బాక్స్, వంటివి దోచుకున్నారు.
కాగా ఆదివారం కాలనిలో అనుమానస్పదంగా సంచరిస్తున్న తల్లి, కొడుకుని స్థానికులు పట్టుకుని పరిశీలించగా అతని బ్యాగ్ లో రాడ్, కొన్ని అనుమానస్పద వస్తువులు లభించాయి. వారిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. నిందితుడు చిలక నగర్ కి చెందిన దుర్గేష్ (20) తానే దొంగిలించానని నేరం ఒప్పుకోవడంతో అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరినుండి బంగారం, వెండి, ల్యాప్ టాప్ రీకవరి చేశారు. నిందితునికి అతని తల్లితో పాటు స్థానికంగా మరో ముగ్గురు సహకరించారని స్థానికులు తెలుపుతున్నారు.