CM Revanth Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూర్తి భరోసా ఇచ్చారు. టెక్నికల్, లీగల్ ఇష్యూలను పరిష్కరించేందుకు పార్టీ, ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. వంద శాతం లీగల్ సపోర్టు లభిస్తుందని వివరించారు. అవసరమైతే ఢిల్లీలో టాఫ్ అడ్వకేట్లతో ఫైట్ చేసేందుకు ప్లాన్ చేద్దామని సీఎం ఆయా ఎమ్మెల్యేలకు వివరించారు. ఆదివారం పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivass Reddy), శ్రీధర్ బాబు(Sridhar Babu)తో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ మీటింగ్ లో ఒక్కోఎమ్మెల్యే నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. అయితే ఈ మీటింగ్ కు కడియం శ్రీహరి గైర్హాజరు కాగా, దానం నాగేందర్ తన అసంతృప్తిని వ్యక్త పరిచినట్లు సమాచారం.
పార్టీ మారలేదని చెప్పండి….
తాము పార్టీ మారలేదని, నియోజకవర్గాల డెవలప్ కు ప్రెండ్లీగా మాత్రమే ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని సీఎం ఆయా ఎమ్మెల్యేలకు సూచించారట. ఆ తర్వాత ఎలాంటి లీగల్ సమస్యలు ఎదురైనా..పార్టీ, ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినట్లు ఓ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డులో చెప్పారు. అంతేగాక నియోజకవర్గాల డెవలప్ కు అవసరమైన నిధులకు ఢోకా లేకుండా చూసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్లకు ఎలాంటి నష్టం జరగనీయను అంటూ సీఎం ధైర్యం చెప్పినట్లు తెలిసింది. ఇక లీగల్ గా ఎలాముందుకు వెళ్దామనే అంశంపై ఒక్కో ఎమ్మెల్యే నుంచి వ్యక్తిగత అభిప్రాయాలను సీఎం కోరగా, ఢిల్లీలో అడ్వకేట్లను నియమించాల్సిందేనని పలువురు శాసనసభ్యులు సీఎం కు వివరించారు. దానికి సీఎం ఓకే చెప్పారు. తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా అందుకు సీఎం సమ్మతి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయాంశాలను సైతం చర్చించారు.
Also Read: MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత
రిజైన్ చేస్తా.. అంగీకరించండి..
తాను రిజైన్ చేసి మళ్లీ పోటీచేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) చెప్పగా, సీఎం వెయిట్ చేయాలని సూచించారట. ఆ అంశంపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే ముందుకు సాగుతామని సీఎం వెల్లడించినట్లు సమాచారం. తన రాజీనామాను ఆమోదించి, జూబ్లీహిల్స్ తో పాటే ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు నిర్వహించాలని దానం ప్రపోజల్ పెట్టగా, సీఎం(CM) పరిశీలిద్దామని చెప్పినట్లు తెలిసింది. దీనిపై దానం తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని జూలై 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి స్పీకర్ సైతం పార్టీ మారిన ఆ 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నాలుగు వారాల గడువు ఇవ్వడంతో దీంతో పలువురు ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చారు. తదుపరిగా స్పీకర్, సుప్రీం కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది.
Also Read: Shivadhar Reddy: డీజీపీగా శివధర్ రెడ్డి?.. సజ్జనార్‌కు కీలక శాఖ అప్పగింత