Viral Video (Image Source: twitter)
Viral

Viral Video: రెస్టారెంట్‌లో సీటు లొల్లి.. ఘోరంగా కొట్టుకున్న.. హోటల్ స్టాఫ్, కస్టమర్లు!

Viral Video: రాజస్థాన్ లో ఓ రెస్టారెంట్ లో తలెత్తిన వివాదం.. పరస్పర దాడులకు దారి తీసింది. హోటల్ స్టాఫ్, కస్టమర్లు ఒకరిపైఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఘర్షణ పడ్డ వారిలో మహిళలు సైతం ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?
జైపూర్‌లోని రెస్టారెంట్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీటు రిజర్వేషన్ పై తలెత్తిన వివాదం గొడవకు దారితీసింది. నహార్గఢ్ కొండలపై ఉన్న పడావ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాదాపు 45 సెకన్ల ఉన్న వీడియోలో దాదాపు 15-20 మంది.. రెండు గ్రూపులుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. మహిళలు కూడా రెస్టారెంట్ సిబ్బందిని కొడుతూ తమ భాగస్వాములను రక్షించడానికి ప్రయత్నించడం వీడియోలో గమనించవచ్చు.

Also Read: Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలతో.. వందే భారత్ స్లీపర్ రైలు.. పండగే పండగ!

స్టాఫ్ వేధించారని ఆరోపణలు
అధికారుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. రెండు జంటలు డిన్నర్ కోసం రెస్టారెంట్‌కి వచ్చారు. వారు రిజర్వ్ చేసుకున్న సీటు విషయంలో సిబ్బందితో వాగ్వాదం ప్రారంభమైంది. అది కొద్దిసేపటిలోనే హింసాత్మక ఘర్షణగా మారింది. ఆ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ రెస్టారెంట్ సిబ్బంది తమను వేధించారని తెలిపారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ రెస్టారెంట్ రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (RTDC) ఆధ్వర్యంలో నడుస్తోంది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read: Viral Video: కెనడా మెట్రో స్టేషన్‌లో.. అలాంటి పని చేస్తూ.. కెమెరాకు చిక్కిన ఇండియా అమ్మాయి

Just In

01

Hanumakonda District: ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం: కలెక్టర్ స్నేహ శబరీష్

Bigg Boss Telugu Season 9: అలాంటి ట్రాక్స్ లేకుండా బిగ్ బాస్ నడపలేరా? ఏకిపారేస్తున్న నెటిజన్స్

BRS Party: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్..?

Nursing Schools Scam: రాష్ట్రంలో నర్సింగ్ స్కూల్స్ దందాలు.. పట్టించుకోని అధికారులు

PDSU Demands: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ యూ ధర్నా.. ఎక్కడంటే..?