Telangana politics (imagecredit:twitter)
Politics

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Telangana politics: ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు కేవలం బీఆర్ఎస్(BRS) లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ట్రబుల్ షూటర్ హరీశ్ రావు(Harish Rao) మొదలుకుని సంతోష్(santhosh), గులాబీ నేతలపై ఆమె చేస్తున్న కామెంట్స్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలుస్తున్నాయి. ఆమె ఇంతలా విమర్శలు చేస్తున్నారంటే దీని వెనుక ఏదో మతలబుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సబ్బండవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా కవితను బీజేపీలో చేర్చుకుంటారా? ఆమెను బీజేపీలో చేర్చుకుంటారా? అనే చర్చ సైతం విపరీతంగా జరుగుతోంది. అయితే కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు ఎంపీలు సైతం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అవినీతిపరులను చేర్చుకోబోయేదిలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ ప్రచారం ఇప్పట్లో ఆగేలా లేదని కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో నుంచే బీఆర్ఎస్(BRS) ను విభేధించిన వారిని బీజేపీలో చేర్చుకుంటూ కాషాయ పార్టీ బలపడుతోంది. బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌(Operation Akarsh)కు తెలంగాణ ఏమీ మిన‌హాయింపు కాదని వాటితో మరింత బలం చేకూరింది.

క‌విత విష‌యంలోనూ బీజేపీ

బీఆర్ఎస్‌తో విభేదించిన ఎంద‌రో నాయ‌కుల‌ను బీజేపీ తన‌వైపు తిప్పుకుంది. కేసీఆర్(KCR) తో రెండు దశాబ్దాలకు పైగా ఉన్న సాన్నిహిత్యం, అన్న అని పిలుచుకునేంత చనువు ఉన్న నాయకుడు, బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌(Etela Rajender), ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), గోడెం న‌గేశ్(Godem Nagesh,), బీబీ పాటిల్‌*(BB Patil), పోతుగంటి రాములు(Pothuganti Ramulu), మాజీ ఎంపీ సీతారాం నాయ‌క్‌, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, గువ్వల బాల‌రాజు, రాథోడ్ బాపురావు, జ‌ల‌గం వెంక‌ట్రావ్‌ వంటి ఎంద‌రో బీఆర్ఎస్ నేత‌ల‌ను బీజేపీ త‌న‌వైపు తిప్పుకుంది. వీరిలో కొంద‌రు ఎంపీలుగా గెలిచారు. ఇంకొంద‌రు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగారు. ఇంకొంద‌రు ఇటీవ‌ల పార్టీలో చేరినవారు కూడా ఉన్నారు. ఇలా ఇప్పటికే కేసీఆర్‌తో విభేదించిన‌ అనేక మంది బీఆర్ఎస్ నేత‌ల‌ను కాషాయ పార్టీ తమ పార్టీలో చేర్చుకుంది. అందుకే కల్వకుంట్ల క‌విత విష‌యంలోనూ బీజేపీ ఇదే సంప్రదాయాన్ని అనుస‌రిస్తుందా..? క‌విత‌ను బీజేపీలో చేర్చుకుంటుందా..? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర ఆస‌క్తి రేపుతోంది.

Also Read: GHMC: ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు.. జీహెచ్ఎంసీ సరికొత్త ఐడియా

గ‌తంలో బీజేపీలో చేర్చుకున్నారా?

ఇదిలా ఉండగా అవినీతిప‌రుల‌ను బీజేపీలో అడుగు పెట్టనివ్వబోమని, అది క‌విత అయినా స‌రే, భ‌విత అయినా స‌రే అని వ్యాఖ్యానించిన‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు(Ramchander Rao) గ‌త చ‌రిత్రను విస్మరించినట్లున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరగుతోంది. అంతేకాకుండా హిమంత బిశ్వ శర్మ, అశోక్ చ‌వాన్‌(Ashok Chavan), ప్రపూల్ ప‌టేల్‌(Prapul Patel), అజిత్ ప‌వార్‌(Ajit Pawar), ముకుల్ రాయ్‌(Mukul Roy), సుజ‌నా చౌద‌రి(Sujana Chowdhury), సీఎం రమేశ్(CM Ramesh) వంటివారిపై అవినీతి ఆరోప‌ణ‌లు లేకుండానే గ‌తంలో బీజేపీలో చేర్చుకున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమ‌వుతున్నాయి. పార్టీలో చేర్చుకున్న వారిలో అనేక మందిపై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నా కూడా బీజేపీ ఎప్పుడూ వెనుకాడ‌లేదు.

బీజేపీలో చేరాక వారిపై ఉన్న కేసుల సంగతి గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ విష‌యంలో బీజేపీ(BJP)పై విప‌క్షాలు అనేక విమ‌ర్శలు చేస్తున్నాయి. బీజేపీ వాషింగ్ పౌడ‌ర్ నిర్మా పార్టీ అని, అవినీతి మ‌ర‌క‌లున్న ప్రతి నేత ఆ పార్టీలో చేర‌గానే మరకలు మాయమైపోతాయని విప‌క్షాలు విమర్శలు చేయడం తెలిసిందే. అదే కోవ‌లో బీఆర్ఎస్‌తో విభేదించి పార్టీకి రాజీనామా చేసిన‌ క‌ల్వకుంట్ల క‌విత‌ను కూడా బీజేపీ త‌న‌వైపు తిప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. దీంతో క‌ల్వకుంట్ల క‌విత విష‌యంలోనూ బీజేపీ(BJP) అదే వ్యూహాన్ని అమ‌లుచేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బ‌హిరంగ ర‌హస్యం

రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం ఏవ‌రినైనా స‌రే పార్టీలో చేర్చుకోవ‌డంలో బీజేపీ ముందుంటుంద‌నేది బ‌హిరంగ ర‌హస్యం. ఒక పార్టీతో విభేధించిన నేత‌ల‌ను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ స‌భ్యుల‌తో విభేధించిన‌ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి ఆ పార్టీ వెనుకాడ‌దనే విమర్శలు సైతం ఉన్నాయి. దీనికి దేశ వ్యాప్తంగా నిరూపించదగిన నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవినీతి మ‌ర‌క‌లున్న నేత‌లు కూడా త‌మ వ్యూహానికి మిన‌హాయింపు కాదనేది సైతం ప్రచారంలో ఉంది. దీంతో తాజాగా తెలంగాణలో క‌విత సంచలన కామెంట్స్ తో బీఆర్ఎస్ లో పెడుతున్న చిచ్చుతో ఆమె విష‌యంలోనూ బీజేపీ ఆ సంప్రదాయాన్ని అనుస‌రిస్తుందా? లేదా? అనేది అస‌క్తిక‌రంగా మారింది.

Also Read: Tragic Incident: గద్వా ల జిల్లా దారుణం.. ఉపాధి కోసం వెళ్లి విగత జీవులుగా మారిన దంపతులు?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!