KTR (imagecredit:swetcha)
Politics

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: రాబోయే ఆరు నెలల్లో పార్టీ పిరాయించిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. సుప్రీంకోర్టు తెలంగాణలో జరిగిన ఫిరాయింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. స్పీకర్ లేదా ఫిరాయింపుదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉప ఎన్నికలు ఖాయమన్నారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivass Reddy) ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్(KCR) నివాసంలో శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్(Congress) చేతిలో పెట్టామన్నారు. కానీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలోనూ రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు పరిపాలన చేతకావడం లేదని, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని నేరుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అడ్డగోలు మాటలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. హామీల వైఫల్యం, నమ్మకద్రోహం ఒక కారణం అయితే, రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాటల తీరు, వ్యవహార శైలి మరో ప్రధాన కారణమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిక్షణం కేసీఆర్ పేరు తలుచుకుంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కేవలం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 21 నెలల కాలంలోనే రూ. 2.20 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిందని, ఆ అప్పుతో ఏ ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.20వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ.20వేల కోట్ల అప్పు చేస్తోందని మండిపడ్డారు.

Also Read: Kim Jong Un: పుతిన్‌తో కిమ్ భేటీ ముగిసిన వెంటనే సీటును శుభ్రం చేసిన భద్రతా సిబ్బంది.. కారణం ఇదే!

స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే..

యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందన్నారు. పంటల కొనుగోళ్లకు, ఆ తర్వాత వాటికి ఇవ్వాల్సిన బోనస్‌ను ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కావాలనే యూరియా సరఫరా చేయడం లేదనిమండిపడ్డారు. గడువులోకా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. పోచారం ఎమ్మెల్యే పదవి కూడా పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీర్ఎస్ లో చేరిన వారిలో ఎంపీటీసీల(MPTC) ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బాన్సువాడ నార్ల రత్న కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేష్, మాజీ కో-ఆప్షన్ హకీమ్ తదితరులు ఉన్నారు.

Also Read: Jagan vs RRR: జగన్‌కు బిగ్ షాక్.. పులివెందులలో బై ఎలక్షన్స్.. బాంబ్ పేల్చిన రఘురామ!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?