Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ ఆదివారం, సెప్టెంబర్ 7, 2025 నుంచి స్టార్ మా ఛానెల్‌లో ఈ కొత్త సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ సారి కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున అలరించనున్నారు.
Also Read: Hyderabad: ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల జోరు.. ఇప్పటికే లక్షన్నరకు పైగా విగ్రహాల నిమజ్జనాలు
అయితే, ఈ సీజన్‌లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు. ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో ద్వారా సామాన్యులను ఎంపిక చేశారు. మొదట 45 మంది నుంచి 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసి, వివిధ టాస్క్‌లతో వారి సత్తాను పరీక్షించారు. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్‌లలో ఇద్దరు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 13 మంది మిగిలారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ 13 మందిలో ఆరుగురు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారట. వారు ఎవరంటే… దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి, హీమ్యాన్ పవన్. ఈ ఆరుగురూ ఫైనల్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Teacher Award Controversy: ఉత్తమ టీచర్ అవార్డుల్లో నిబంధనలకు తూట్లు.. విరుద్ధంగా అవార్డులు
ఇక సెలబ్రిటీల విషయానికొస్తే, సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్‌గా మారింది. ఈ లిస్ట్‌లో రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లా వంటి పేర్లు ఉన్నాయి. అయితే, ఈ లిస్ట్‌లో ఎవరెవరు నిజంగా హౌస్‌లోకి అడుగుపెడతారో తెలియాలంటే సెప్టెంబర్ 7 సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే. ఈ సీజన్ ‘అగ్నిపరీక్ష – ట్రయల్ బై ఫైర్’ థీమ్‌తో, డబుల్ హౌస్ ఫార్మాట్‌తో మరింత డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. మరి, ఈ కొత్త సీజన్‌లో ఎవరు హౌస్‌లో హవా చూపిస్తారు? ఎవరు ఈ గేమ్‌ను రూల్ చేస్తారు? అన్నది చూడాలంటే, ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: Blood Moon 2025: ఈ ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ప్రత్యేక పరికరాల అవసరం లేకుండానే వీక్షించవచ్చు