Bigg Boss Telugu 9: ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అడుగుపెట్టబోతుందని సమాచారం.
Also Read: MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్, హాట్ ఫోటోలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న రీతూ, తన నటన, అందంతో జబర్దస్త్ షోలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఆకర్షణీయ ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంటోంది. ఇప్పుడు, సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆమె పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు, అందులో రీతూ చౌదరి పేరు కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read: CM Revanth Reddy: అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలే.. బీఆర్ఎస్‌లో చిచ్చుపెట్టింది.. సీఎం రేవంత్
అయితే, రీతూ చౌదరి గ్లామర్‌తో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు రాగా, దీనిపై పోలీసులు ఆమెను 9 గంటల పాటు విచారించారు. ఈ కేసులో రీతూ, తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె పేరు కూడా వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను రీతూ ఖండించింది. తనకు ఈ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కొందరు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, అంత డబ్బు ఉంటే, ఇన్ని కష్టాలు ఎందుకు పడతా అంటూ అందరి పై మండిపడింది. ఇక ఇదే సమయంలో వచ్చిన బిగ్ బాస్ హౌస్ అవకాశాన్ని వదులుకోకుండా.. ఎలా అయిన ఎంట్రీ ఇచ్చి.. అబ్బాయిలకు మసాలా ట్రీట్ ఇచ్చి, తన మీద ఉన్న వచ్చిన ఆరోపణల నుంచి కొంత మేరకు బయటపడాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రీతూ చౌదరి జీవితంలో ఎన్నో కష్టాలను చూసింది. అలాగే, వ్యక్తిగత సవాళ్లు ఎన్నో ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ఆమె తండ్రి మరణించడంతో, కుటుంబ బాధ్యతలు ఆమె భుజాలపై పడ్డాయి. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, తన గ్లామర్, నటనతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో తన కుటుంబం కోసం కష్టపడుతున్న తీరును చూసిన అభిమానులు ఆమెను మెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఆమె మరింత మంది ప్రేక్షకుల ఆదరణ పొందాలని, తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టాలని ఆశిస్తోందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.