CM Revanth Reddy: బీఆర్ఎస్ పార్టీలో చెలరేగిన అంతర్యుద్ధం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో రూ. లక్ష కోట్లు దోచుకున్నారన్న రేవంత్.. అవినీతి సొమ్ము పంపకాలు కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని ఆరోపించారు. వాళ్లు వాళ్లు కొట్లాడుకొని కాంగ్రెస్ మీదకు వస్తున్నారని మండిపడ్డారు. కాలనాగు లాంటి బీఆర్ఎస్ ను ప్రజలే బండరాయితో కొట్టి చంపారని రేవంత్ అన్నారు. చచ్చిన పామును మళ్లీ తాను చంపాలా? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు.
‘మమ్మల్ని లాగకండి’
కేసీఆర్ వాళ్ల కుటుంబానికి ఎన్నో ఆస్తులు కట్టబెట్టారని. ప్రశాంతతను మాత్రం ఇవ్వలేక పోయారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ వాళ్ల కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ లు ఇచ్చిండు, బంగ్లాలు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు. అన్ని ఇచ్చిండు కానీ ప్రశాంతత ఇవ్వలేకపోయాడు. మీ కుటుంబ పంచాయతీల్లోకి మమ్మల్ని లాగకండి’ అని రేవంత్ మరోమారు స్పష్టం చేశారు.
Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. కొద్దిలో తప్పించుకున్న బైకర్!
దోపిడీ సొమ్ము కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది : సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్…వాళ్ల కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ లు ఇచ్చిండు, బంగ్లాలు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు
అన్ని ఇచ్చిండు కానీ ప్రశాంతత ఇవ్వలేకపోయాడు
చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకు ఏముంది?
మీ… pic.twitter.com/DPYENQEE4v
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025
‘మీ వెనకలా ఎవరైనా ఉంటారా’
అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్ నేతలకు బయట వారు అక్కర్లేదని.. వాళ్లను వాళ్లే పొడుచుకుంటారని ‘హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే.. లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు. మీరంతా దిక్కుమాలినవారని తెలిసి తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా? దయచేసి మీ కుటుంబ పంచాయతీలోనో.. మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి. మాకు ఎలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది’ అని రేవంత్ అన్నారు.