Kavitha( image CREDIT: TWITTER)
Politics

Kavitha: కవిత వ్యూహాత్మక అడుగులు సస్పెన్షన్ తర్వాత గులాబీ పార్టీకి షాక్?

Kavitha: కవిత(Kavitha) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేస్తుంది. తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్ కు ఇబ్బంది కరపరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు రెండ్రోజులపాటు చేయనున్నట్లు సమాచారం. ఆతర్వాతే పార్టీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారినుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.

పార్టీ ఎమ్మెల్సీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత(Kavitha).. జై కేసీఆర్ నినాదం అందుకుంది. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్(KCR) అంటూ నినదించింది. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫొటో ఉంటుందని స్పష్టం చేశారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మ‌క అడుగులువేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

 Also Read: KA Paul on Kavitha: కవిత ప్రజాశాంతి పార్టీలోకి రావాలి.. మీరేంటో నిరూపించుకోవాలి.. కేఏ పాల్ పిలుపు

జై కేసీఆర్ నినాదం

కేసీఆర్‌(KCR)పై గౌర‌వం ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లు, సీనియ‌ర్ల‌పై అసంతృప్తితో ఉన్న క్యాడ‌ర్‌లో త‌న‌పై సానుభూతి పెరిగి క‌చ్చితంగా త‌న‌కు అండ‌గా నిలుస్తార‌ని క‌విత భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మ‌కంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్న‌ట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం, క‌విత వ్యూహాత్మ అడుగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌తోపాటు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బ‌తీస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కవితను పార్టీ సస్పెండ్

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీ అధిష్టానం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వారికి సైతం పార్టీలో గుర్తింపు దక్కలేదనే ఆసంతృప్తి ఉన్నారు. పార్టీలో పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో త్వరలోనే పార్టీ పెట్టబోతుందనే ప్రచారం నేపథ్యంలో అసంతృప్తి నేతలంతా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని , దీనికి కవిత కూడా ఓకే చెబుతున్నట్లు ప్రచారం మొదలైంది. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్ కావాలంటే గతంలో పనిచేస్తున్న నేతల్లో కొంత మంది కవితకు సానుభూతి పరులు ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా చేరుతారనే ప్రచారం జరుగుతుంది. దీనికి అనువుగా తీసుకొని త్వరలోనే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జాగృతి బలోపేతానికి శ్రీకారం

ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజులపాటు జరుగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో బతుకమ్మ సంబురాలను నిర్వహించింది. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబురాలను జాగృతి సంస్థ తరుపున నిర్వహించడంతో పాటుఉమ్మడి జిల్లాల్లో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైన ఇక కవిత గ్రామస్థాయి నుంచి జాగృతి బలోపేతానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే జాగృతి నేతలకు లీగర్ శిక్షణ తరగతులను నిర్వహించింది. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంతో పాటు లీడర్ గా గుర్తింపు తెచ్చేందుకు చర్యలకు శ్రీకారం చుట్టింది.

Also Read: Bhupalapally district: భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్త, కూతుర్ని లేపేసిన మహిళ!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?